J. SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నవరాత్రి ఉత్సవాలకు రావలసిందిగా ఆలయ అర్చకులు వేద పండితులు కార్య నిర్వహణ అధికారి సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ ను ఆహ్వానించారు.

ధర్మపురి లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ , ఆధ్వర్యంలో వేద పండితులు అర్చకులు, ఆహ్వాన పత్రము స్వామివారి ప్రసాదం, శేష వస్త్రం బహుకరించి మంత్రిని ఘనంగా ఆశీర్వదించి ఆహ్వానించారు. ఈ నెల 22 నుండి 30 వరకు 9 రోజులపాటు ఉత్సవాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
👉 వెల్గటూర్ మండలం…

వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామంలో ని శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, మరియు కళ్యాణోత్సవ ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ సభ్యులు ధర్మపురి లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రికి పత్రికను అందజేశారు. ఈనెల 20 నుంచి ప్రారంభమయ్యే వేడుకలలో పాల్గొనాలని ఆహ్వానించారు.
👉 ధర్మారం మండలం..,.

ధర్మారం మండలం ఖిలా వనపర్తి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం మంత్రి కి అందించారు.. ఈనెల 25 నుండి మే 2వ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, అధికారులు మంత్రి కి శేష వస్త్రం ప్రసాదం అప్పగించి ఆహ్వానించారు.
