👉 పేద విద్యార్థి భవిష్యత్తును మార్చే శక్తి కేంద్రాలు గురుకులాలు !
👉 విజయ దుందుభి మోగించి 99.12% ఉత్తీర్ణతతో కార్పొరేట్ సంస్థలను అధిగమించి ఫలితాలు !
👉 సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యకు పెద్ద పీట !
👉 40 ఏళ్ల చరిత్రలో 99.22 శాతం పాస్ పర్సంటేజ్ నమోదు కావడం ఇదే తొలిసారి !
👉 సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు 2026 పదవ తరగతి ఫలితాల్లో 99.12 శాతం ఉత్తీర్ణత సాధించి చరిత్ర సృష్టించాయి. మొత్తం 17,071 మంది పరీక్షలకు హాజరుకాగా 16,921 మంది ఉత్తీర్ణులయ్యారని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ప్రతిపక్షాల విమర్శలు కు మా విద్యార్థుల సాధించిన ఫలితాలే సమాధానం అని కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఈ ఫలితాలు సాధించడం గురుకులాల విద్యా ప్రమాణాలను మరింత బలపరిచిందన్నారు.
👉 గురువారం డి ఎస్ ఎస్ భవన్ లోని TGSWREIS లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడుతూ…

ఇది కేవలం ఫలితం కాదని, వ్యవస్థాత్మక మార్పులు, నిరంతర పర్యవేక్షణ, ప్రభుత్వ సంకల్పం, వ్యూహాత్మక సంస్కరణల సమిష్టి ఫలితమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గురుకులాలను నూతన దిశగా తీసుకెళ్తున్నామని మంత్రి వెల్లడించారు.
👉 ఫలితాల్లో రికార్డు !
@ 235 ఇనిస్టిట్యూషన్లలో 163 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించాయి….
@ 9 జిల్లాల్లో అన్ని గురుకులాల్లో 100% ఫలితాలు సాధించాయి…
@ ఇంటర్ II సంవత్సరంలో 88.22% ఉత్తీర్ణత, 41 కాలేజీల్లో 100%….
@ ఇంటర్ I సంవత్సరంలో 77.79% ఉత్తీర్ణత, 12 కాలేజీల్లో 100%…
@ JEE మెయిన్స్‌లో 441 మంది అర్హత, 35 మంది 90 పర్సెంటైల్ పైగా…
@ IIT, JEE, NEETలో కూడా మెరుగైన ఫలితాలు !
స్టూడెంట్ సెంట్రిక్’ విధానమే విజయ రహస్యమన్న మంత్రి లక్ష్మణ్ కుమార్ ఇందుకోసం ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ
రోజువారీ బోధనతో పాటు ప్రత్యేక స్టడీ అవర్స్ సాయంత్రం డౌట్ క్లారిఫికేషన్ సెషన్లు వీక్లీ, మంత్లీ అసెస్‌మెంట్లు సిలబస్ పూర్తయ్యాక ప్రత్యేక రివిజన్ ఫెయిల్యూర్ రిస్క్ ఉన్న విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్.
👉“ఒక్క విద్యార్థి కూడా వెనుకబడకూడదు” అనే లక్ష్యంతో ట్రాకింగ్ వ్యవస్థ అమలు చేసినట్లు మంత్రి తెలిపారు.
అకడమిక్ సంస్కరణలు డేటా ఆధారిత విధానం
“బేసిక్ టు అడ్వాన్స్‌డ్” లెర్నింగ్ మోడల్ సబ్జెక్ట్ వారీ మైక్రో ప్లానింగ్ స్టూడెంట్ & టీచర్ వైజ్ అనాలిసిస్ పర్ఫార్మెన్స్ డ్యాష్‌బోర్డ్స్ వెంటనే కరెక్టివ్ యాక్షన్.
👉 ఉపాధ్యాయుల అంకితభావం!
ఉపాధ్యాయులు విద్యార్థులను తమ సొంత పిల్లలుగా చూసుకుంటూ 24 గంటలు అందుబాటులో ఉండి బోధన అందించడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని మంత్రి ప్రశంసించారు. టీచర్లకు ట్రైనింగ్స్, వర్క్‌షాప్స్, ఫలితాల ఆధారంగా రివ్యూ సిస్టమ్ అమలు చేస్తున్నట్లు తెలిపారు.
👉 పోషకాహారం – ఫలితాల పునాది !
విద్యార్థుల ఆరోగ్యం, మానసిక స్థైర్యం విద్యా ఫలితాల్లో కీలకమని గుర్తించి మెస్ ఛార్జీలను పెంచి ప్రోటీన్ రిచ్ డైట్ అందిస్తున్నామని తెలిపారు.హాజరు పెరగడం, ఆరోగ్య సమస్యలు తగ్గడం ఫలితాల్లో ప్రతిబింబించిందన్నారు.
👉 కాస్మోటిక్ ఛార్జీలు – గౌరవప్రద జీవనం !
విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత, ఆత్మవిశ్వాసం పెంచేందుకు కాస్మోటిక్ ఛార్జీలు పెంచినట్లు చెప్పారు. మౌలిక సదుపాయాల్లో మార్పులు
👉 ఆధునిక హాస్టల్ సదుపాయాలు !
డిజిటల్ క్లాస్‌రూమ్స్ సైన్స్, కంప్యూటర్ ల్యాబ్స్
లైబ్రరీలు, క్రీడా వసతులు గురుకులాలను “మోడల్ ఎడ్యుకేషన్ క్యాంపసెస్”గా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
👉 మానసిక స్థైర్యం – ప్రత్యేక శ్రద్ధ !
ఎగ్జామ్ ముందు స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కౌన్సెలింగ్, మోటివేషనల్ సెషన్లు హోస్టల్ వాతావరణాన్ని ఫ్యామిలీలా మార్చడం ద్వారా ఈ ఫలితాలు సాధ్యమయ్యాయన్నారు.
👉 పరిపాలనలో పారదర్శకత !
డైట్, కాస్మోటిక్ బిల్లులు మార్చి 31 నాటికి క్లియర్ చేయడం జరిగిందన్నారు.
👉 భవనాల అద్దెల చెల్లింపు పూర్తి !
ప్రతి నెల మొదటి వారంలో బిల్లులు క్లియర్ చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ పెండింగ్ బిల్లుల క్లియరెన్స్‌పై ప్రత్యేక చొరవ తీసుకోవడం జరిగిందన్నారు.
👉 తల్లిదండ్రుల విశ్వాసం పెరుగుతోంది !

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గురుకులాలపై ప్రత్యేక శ్రద్ధ వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విప్లవాక్కుపైన మార్కులు తేవడం జరిగింది అన్నారు దళిత గిరిజన విద్యార్థుల చదువుపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించాలని వారికి విద్యనియడం మూలానే ఉన్నత శిఖరాలకు అధిరోహించి వారు స్థిరపడతారని ముఖ్యమంత్రి ప్రగాఢ విశ్వసమని మంత్రి పేర్కొన్నారు
అందుకు అనుగుణంగానే ఎన్నడూ లేని విధంగా కాస్మటిక్ మెస్ చార్జీలను పెద్ద ఎత్తున పెంచడం జరిగిందన్నారు.
ప్రతిపక్షాల విమర్శలు ఉన్నప్పటికీ సాంఘిక గిరిజన, సంక్షేమ గురుకులాలపై తల్లిదండ్రుల నమ్మకం మరింత పెరిగిందన్నారు.
👉 ఈ ఏడాది అడ్మిషన్లు రికార్డు స్థాయిలో పెరగడం ఇందుకు నిదర్శనమన్నారు.
గతంతో పోలిస్తే గణనీయ పురోగతి గత సంవత్సరాలతో పోలిస్తే ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగిందని, ఇది ప్రభుత్వ విధానాల విజయానికి నిదర్శనమన్నారు.
👉 భవిష్యత్ లక్ష్యం !
“గురుకులాలను దేశంలోనే ఉత్తమ విద్యా నమూనాగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. పేదల పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య అందిస్తూ గ్లోబల్ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దుతాం” అని మంత్రి స్పష్టం చేశారు.
👉 ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఘనంగా సన్మానించారు.

👉 ఈ సందర్భంగా ఎస్సీ డి డి ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్సీ హాస్టల్లో ఉత్తీర్ణత శాతాన్ని కూడా మంత్రి వివరించారు.
@షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖలోని 63 ప్రీమెట్రిక్ వస్తి గృహాల నుంచి 8060 విద్యార్థులు పదో తరగతి
పరీక్షలకు హాజరు కావుగా 7666 మంది ఉత్తీర్ణులయ్యారని ,@ ఉత్తీర్ణత శాతం 95.11% అని మంత్రి పేర్కొన్నారు.
ఇది రాష్ట్ర సగటు 95.15 కంటే కేవలం 0.04% మాత్రమే అని మంత్రి స్పష్టం చేశారు.
@100% ఉత్తీర్ణత సాధించిన వసతి గృహాలు 369 కాగా 100% ఉత్తీర్ణత సాధించిన జిల్లా ములుగు అని మంత్రి తెలిపారు.
@91% నుండి 100 % మార్కుల మధ్యలో 195 మంది విద్యార్థులు ఉన్నారని
@81 % నుండి 90% మార్కుల మధ్యలో 1416 విద్యార్థులు ఉన్నారని మంత్రి తెలిపారు.

👉 ఎస్సీ వసతి గృహంలో అత్యుత్తమ మార్కులు 581 నమోదయిందని సంగారెడ్డి జిల్లాకు చెందిన రామావత్ మల్లేశ్వరి ఈ మార్కులు సాధించడం జరిగిందని రెండవ స్థానాల్లో ముగ్గురు విద్యార్థులు 579 మార్కులు సాధించారని మంత్రి తెలిపారు.
👉 గిరిజన ఆశ్రమ పాఠశాలలో మొత్తం 26 పాఠశాలలో 124 పాఠశాలలో 100% రిజల్ట్స్ సాధించినట్లు మంత్రి వెల్లడించారు.
ఈ సమావేశంలో సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి సభ్య సాచి ఘోష్, గిరిజన శాఖ డైరెక్టర్, ఇంచార్జ్ కమిషనర్ సంతోష్, మంత్రి ఓ ఎస్ డి వై.జె విజయ్ కుమార్
TGSWREIS జాయింట్ సెక్రెటరీ బానోతు గీత, అడిషనల్ సెక్రటరీ (అకాడమిక్) సక్కు నాయక్, ఆశ్రమ పాఠశాల డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, TGSWREIS ఇన్స్టిట్యూషన్ లకు చెందిన జోనల్ ఆఫీసర్లు, ఆర్ సి ఓ లు, వివిధ పాఠశాలలు కళాశాలలు చెందిన ప్రిన్సిపల్స్ , SSC ఇంటర్ జేఈఈ మెయిన్స్ లో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
