తెలంగాణ విద్వత్సభ దశాబ్ది ఉత్సవాలు !

👉 ఆగస్టు 1 శనివారం, 2 ఆదివారం రోజులలో..

👉 రవీంద్ర భారతి హైదరాబాద్ లో..!

👉 జీవన సాఫల్య, విశిష్ట ప్రతిభాపురస్కారాల ప్రధానం !


J.SURENDER KUMAR,


హైదరాబాద్ రవీంద్ర భారతి మందిరంలో ఆగస్టు 1, 2, తేదీలలో ( శని ఆదివారం రెండు రోజులపాటు)  తెలంగాణ విద్వత్సభ దశాబ్ది మహోత్సవాలు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా రెండు రోజుల దశాబ్ది మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది తెలంగాణ విద్వత్సభ జరగనున్నాయి.

👉 సభలకు ముఖ్యఅతిథులుగా…!

ఈ సభలకు ముఖ్యఅతిథులుగా మంత్రి దుద్దిళ్ళ శ్రీధరబాబు,  మంత్రి  జూపల్లి కృష్ణారావు , మంత్రి శ్రీమతి కొండా సురేఖ, విశిష్ట అతిథులుగా ధార్మిక, ఆధ్యాత్మిక వేత్తలు, ఉన్నతాధికారులు వివిధ రంగాల ప్రముఖులు విచ్చేస్తున్నారు. రాష్ట్ర దేవదాయ, ధర్మదాయశాఖ పరిధిలోని వివిధ దేవాలయాల ప్రధాన అర్ఛకులు, స్థానాచార్యులు, పురోహితులు, వేదపండితులు హాజరుకానున్నారు.


👉 రాష్ట్ర ఆవిర్బావం తరువాత…

తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తర్వాత నవ తెలంగాణలో సిద్ధాంతులు, పంచాంగకర్తలు,వేద,శాస్త్ర ,ఆగమ పండితులను ఒకే వేదకపై సమన్వయపరచి ప్రభుత్వానికి ప్రజలకు ధార్మికవారధిగా ఉంచే లక్ష్యంతో ‘తెలంగాణ విద్వత్సభ’ ఏర్పాటయింది. ప్రతి సంవత్సరం పండగల నిర్ణయం చేసి ప్రభుత్వానికి సమర్పిస్తూ పండగల పట్ల సందేహాలు లేకుండా ఈ సభ పది సంవత్సరాలుగా కృషి చేస్తోంది. ప్రతి సంవత్సరం విద్వత్సమ్మేళనాలను , ప్రాంతీయ సదస్సులను, విద్వద్గోష్ఠులను నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం, అవగాహన కలిగిస్తోంది.

జ్యోతిషం, ఆగమం, పంచాంగం, ధర్మశాస్త్రాల పట్ల నిష్ణాత విద్వన్మూర్తులతో విద్వద్గోష్ఠులలో ప్రసంగాలను ఏర్పాటు చేస్తోంది. గత పదేళ్ళుగా దేశంలోఎక్కడా లేని విధంగా ‘తెలంగాణ విద్వత్సభ’ తెలంగాణ రాష్ట్రంలో ధార్మిక,విశిష్ట సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వేద,ధర్మ,జ్యోతిష, ఆగమ,శాస్త్ర పండితులు, సిద్ధాంతులను విశిష్ట ప్రతిభా పురస్కారాలతో ఘనంగా సమ్మానిస్తోంది. పదేళ్ళ క్రితం రవీంద్రభారతిలో ఏర్పాటైన ఈ సభ ప్రస్తుతం వైభవంగా దశాబ్ది మహోత్సవాలను జరుపుకుంటోంది.


👉 మొదటి రోజు ఆగస్టు ఒకటి శనివారం !

ఉదయం 9గంటలకు ఈ మహాసభలను పుష్పగిరి జగద్గురు మహాసంస్థానం పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ అభినవోద్దండ విద్యాశంకరభారతీ స్వామి వారు జ్యోతిప్రకాశనం చేసి ఆరంభిస్తారు. ‘విద్వత్సభ సంహిత.. దశాబ్ది దీపిక’ విశిష్ట సంచికను స్వామివారు ఆవిష్కరిస్తారు. తొలిరోజు ఉదయం జ్యోతిష సదస్సు, మధ్యాహ్నం ఆగమ సదస్సు సాయంత్రం విద్వత్సమ్మేళనం అనంతరం జ్యోతిరాదిత్యం రూపకం ప్రదర్శన జరుగుతాయి.

👉 రెండవ రోజు ఆగస్టు 2 ఆదివారం !

రెండోరోజు ఉదయం సిద్ధాంత సదస్సు, మధ్యాహ్నం ధర్మశాస్త్ర సదస్సు, సాయంత్రం విద్వత్సమ్మేళనం అనంతరం సమాపనోత్సవం జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హార్కర వేణుగోపాలరావు, రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు డా. కె.వి. రమణాచారి, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు చైర్మన్ బసవరాజు శ్రీనివాస్, వైస్‌ చైర్మన్ పొన్నాడ సుబ్రహ్మణ్యం, దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలజా రామయ్యర్, పూర్వ కేంద్ర మంత్రి ఎస్. వేణుగోపాలాచారి విశిష్ట అతిథులుగా పాల్గొననున్నారు.

రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎం. హనుమంతరావు, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి, ముఖ్యమంత్రి ప్రజావాణి నోడల్ అధికారి కె. విద్యాసాగర్ గౌరవ అతిథులుగా హాజరుకానున్నారు.

👉 వరిష్ఠ విద్వన్మూర్తులకు జీవనసాఫల్య, విశిష్ట ప్రతిభా పురస్కారాలు !

ఈ ఉత్సవంలో తెలంగాణ రాష్ట్రంలో 10 ఉమ్మడి జిల్లాల వరిష్ఠ విద్వన్మూర్తులకు జీవనసాఫల్య పురస్కరాంతో పాటు విశిష్ట ప్రతిభా పురస్కారాలతో సత్కారాలు,

ప్రముఖ గేయవాల్మీకి, సుప్రసిద్ధ విద్యాంసులు అయిన బ్రహ్మశ్రీ రుక్మాభట్ల నరసింహస్వామికి ప్రతిష్ఠాత్మకమైన ‘జీవన సాఫల్య పురస్కారం’ ప్రదానం చేయనున్నారు. ఇదే వేదికపై పలువురు వరిష్ఠ విద్వన్మూర్తులకు విశిష్ట ప్రతిభా పురస్కారాలతో ఘనంగా సత్కారం జరగనుంది.

👉 ఈ కార్యక్రమంలో విశిష్ట ప్రతిభా పురస్కారాలు అందుకోనున్న ప్రముఖ పండితుల వివరాలు:!


1.విఖ్యాత వేదపండితులు బ్రహ్మశ్రీ గట్టు నరహరిశర్మ అవధాని !


2. వైదిక స్మార్తాగమ పండితులు బ్రహ్మశ్రీ రాంపల్లి నారాయణశర్మ అవధాని !


3. ప్రముఖ పంచాంగకర్త, పండితులు బ్రహ్మశ్రీ ఆకెళ్ళ జయకృష్ణశర్మ సిద్ధాంతి

!
4. ప్రముఖ పంచాంగకర్త …
బ్రహ్మశ్రీ బోర్పట్ల రాఘవేంద్రాచార్య సిద్ధాంతి !


5. ప్రముఖ సాహితీ వేత్త…
శ్రీమాన్ పెరంబదూరు డా. శ్రీరంగాచార్య !


6. విఖ్యాత వైదికాగమ పండితులు… బ్రహ్మశ్రీ యల్లంభట్ల సీతారామశాస్త్రి !


7. ఉభయభాషా, ఆగమ పండితులు… శ్రీమాన్ కోదండరామాచార్యులు !


8. విఖ్యాత వేద, శాస్త్ర పండితులు… బ్రహ్మశ్రీ శాస్త్రుల వేంకటేశ్వరశర్మ !


9. ధార్మికవేత్త, గీతాప్రచారకులు….
బ్రహ్మశ్రీ మదునూరి వేంకటరామశర్మ !


10. విఖ్యాత జ్యోతిష పండితులు…
శ్రీమతి మహోవాది సంధ్యాలక్ష్మి !


11. ప్రముఖ పంచాంగకర్త…
బ్రహ్మశ్రీ శాస్త్రుల కృష్ణమూర్తిశర్మ సిద్ధాంతి !


12. ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు…
బ్రహ్మశ్రీ గౌరిభట్ల సత్యనారాయణశర్మ !


13. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త…
బ్రహ్మశ్రీ బోర్పట్ల హనుమంతాచార్య !

విశిష్ట సత్కార కార్యక్రమంలో ఆస్తిక మహాశయులందరూ పాల్గొని జయప్రదం చేయాలని నిర్వాహకులు తెలంగాణ విద్వత్సభ అధ్యక్షులు యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి, కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతి , కోశాధికారి మరుమాముల వెంకటరమణశర్మ(దర్శనమ్ శర్మ)కోరారు.

👉 వివరాలకు సంప్రదించవలసిన నంబర్లు !

యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి , మొబైల్ నెంబర్ 9440792801, దివ్యజ్ఞాన సిద్ధాంతి, మొబైల్ నెంబర్ – 9849567669 మరుమాముల వెంకటరమణశర్మ మొబైల్ నెంబర్  9441015469.