మృతుల కుటుంబ సభ్యులకు చివరి స్మృతులు దక్కేనా ?

👉 నెల రోజులైనా దొరకని ఐఫోన్ !

👉 దేశంలోనే సెల్ ఫోన్ ల రికవరీలో తెలంగాణ పోలీసులు టాప్ !

J.SURENDER KUMAR,

ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురిలో  ఒకరి ఐ ఫోన్ సంఘటన స్థలంలో  అదృశ్యం అయ్యింది.. అల్లారు ముద్దుగా పెంచుకున్న వారి పిల్లల చివరి మజిలీ ఆనంద క్షణాలు వారి ఫోనులో చిత్రీకరించుకున్నారు. ప్రమాద స్థలంలో పోలీసులు రెండు ఫోన్ లు  స్వాధీనపరుచుకున్నారు. మరో ఫోన్ మాయమైంది. ఆ ఫోన్ లో  తమ పిల్లలు చిత్రీకరించుకున్నట్టు భావిస్తున్న చివరి ఆనంద స్మృతులను చూసుకోవడానికి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా గత కొంత రోజులుగా మౌనంగా రోధిస్తున్న వారి దీన గాధ ఇది..

👉 వివరాల్లోకి వెళితే..

ఏప్రిల్ 1 అర్ధరాత్రి ధర్మపురి పట్టణం శివారులో
మాటలక అందని  మహా విషాద సంఘటన జరిగింది.. కఠినాత్ములు సైతం కన్నీరు కార్చే హృదయ విదారక సంఘటన అది  ముక్కుపచ్చలారని ముగ్గురు టీనేజ్ కుర్రవాళ్ళు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన  సంఘటనలో  అదృశ్యమైన ఐఫోన్ ఆచూకీ నేటికీ నెల రోజులుగా   దొరకడం లేదు..మృతులలో ఒకరికి చెందిన లక్షలాది రూపాయల విలువైన ఐ ఫోన్  ఎవరో ప్రమాద స్థల నుంచి చేతివాటం ప్రదర్శించి ఎత్తుకెళ్లారు.

👉 వెలుగు చూసింది ఇలా….

రోడ్డు ప్రమాద విషాద సంఘటన నుంచి కుదుటప పడిన బాధిత కుటుంబం బంధువులలో ఒకరు  ” వారం రోజుల క్రితం మన వాడికి  ఐఫోన్ కొనిచ్చాం. ” (దాదాపు ₹ 1,75 లక్షల విలువ గల ఐఫోన్) అందులో ప్రమాదానికి ముందు స్నేహితులు ఏదైనా ఫోటోలు, వీడియోలు తీసారా ? అంటూ ఆరా తీయగా అప్పుడు లక్షలాది రూపాయలు విలువ గల ఐఫోన్ మాయమైనట్టు కుటుంబ సభ్యులకు మృతుడి స్నేహితులకు బంధువులకు తెలిసింది.

మృతుడు ఆ ఫోన్ లో  తన మరో స్నేహితుడికి ఎమర్జెన్సీ నంబర్ ఫీడ్ చేసి ఉండగా. కొన్ని రోజుల క్రితం రాయపట్నం, మంచిర్యాల్  నుంచి స్నేహితుడి ఫోన్ కు  సిగ్నల్స్ వచ్చాయి. మృతుడి బంధువులు ఏప్రిల్ 6న  మీసేవ ద్వారా యూజర్ చార్జర్ చెల్లించి ఐఫోన్  మాయం పై ఫిర్యాదు చేశారు.

పోలీసులకు ఆన్లైన్ ఫిర్యాదు చేసిన రసీదు ఏప్రిల్ 6న (ఫైల్ ఫోటో)

👉 సెల్ ఫోన్ ల రికవరీలో దేశంలోనే తెలంగాణ పోలీసులు టాప్ !

పోగొట్టుకున్న, దొంగిలించబడిన వేలాది సెల్ ఫోన్ లను  గుర్తించి రికవరీలో సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్‌ను
(CEIR ) ఉపయోగించి తెలంగాణ పోలీస్ యంత్రాంగం దేశంలోనే  2026  ఏప్రిల్ 26 నాటికి టాప్ లో  ఉంది. మాయమైన ఫోన్  బ్లాక్ చేయడానికి అధికారిక ప్రభుత్వ పోర్టల్ ceir.gov.in ను పోలీస్ యంత్రాంగం వినియోగిస్తుంది

👉 సీఐడీ డీజీ చారుసిన్హా …
1,24,850  సెల్ ఫోన్లు స్వాధీనం !

ఈ నెల 26వ తేదీ వరకూ 1,24,850 ఫోన్ల ఆచూకీ  కనుగొన్నామని సిఐడి డీజీ చారుసిన్హా ప్రకటనలో తెలిపారు.
ఫోన్ల చోరీని అరికట్టేందుకు టెలికాం మంత్రిత్వశాఖ ‘సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రార్ (సీఐఈఆర్)’ అభివృద్ధి చేసిం దని, రాష్ట్రానికి సంబంధించి సీఐడీ దీనికి నోడల్ ఏజెన్సీగా ఉందన్నారు. ఫోన్ పోగొట్టుకున్న వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తే సీఐఈఆర్ ద్వారా దాన్ని బ్లాక్ చేసి, ఎక్కడుందో కనుక్కొని, స్వాధీనం చేసుకొని, బాధితులకు అప్పగిస్తామన్నారు.

సీఐఈ ఆర్ మొదలైనప్పటి నుంచీ ఈ ఏప్రిల్ 26వ తేదీ వరకూ మొత్తం 4,82,652 ఫోన్లు బ్లాక్ చేయగా వాటిలో 2,82260 మొబైళ్ల ఆచూకీ కనుగొన్నా మని, ఇందులో 1,24,850 స్వాధీనం చేసుకొని అన్ బ్లాక్ చేశామన్నారు. ఇలా స్వాధీనం చేసుకున్న ఫోన్లను యజమానులకు అప్పగిస్తామన్నారు.

👉 ఫోన్ రికవరీలో ఆలస్యం ఎందుకు ?

ప్రమాద స్థలం నుండి అదృష్టమైన ఐఫోన్ గుర్తించి స్వాధీనం చేసుకోవడంలో పోలీస్ యంత్రాంగం ఎందుకు ఆలస్యం చేస్తున్నదో అంతు పట్టని చిదంబరా రహస్యంగా  మారింది.

👉 ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే దొరకదా ?

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఐఫోన్ ఏ ప్రదేశంలో, ఏ సెల్ టవర్  నుంచి సిగ్నల్స్, రాడార్ ప్రాంతాన్ని గుర్తించడం. ప్రస్తుత సాంకేతిక యుగంలో సులభతరం. కానీ పోలీసు యంత్రాంగం మాత్రం ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది, ఫోన్ ఆన్ అయితే లొకేషన్ ట్రేస్ అవుట్ చేస్తామంటూ బాధిత కుటుంబానికి చెప్పుతున్న సమాధానం.

నవమాసాలు మోసి కని అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం హృదయ హృదయ విదారక తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం..

తన కొడుకు చివరి మజిలీ ఆనంద స్మృతులను చూసుకోవడానికి ఆ తల్లిదండ్రులు పడుతున్న మానసిక వేదనను జగిత్యాల జిల్లా పోలీస్ ఉన్నతాధికారి స్పందించి  సెల్ ఫోన్ ఆచూకీ వెలికి తీసి బాధిత కుటుంబానికి అందిస్తారని ప్రజాస్వామ్యవాదులు ఆశిస్తున్నారు..