ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వ చర్చలు సఫలం !

👉 ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి అంగీకారం !

👉 క్యాబినెట్ సబ్ కమిటీ.. జూన్ 2న విలీన ప్రకటన

👉 ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలకు సమ్మతి !

👉 28 డిమాండ్లు అంగీకరించిన ప్రభుత్వం!

👉 శుక్రవారం అర్ధరాత్రి ముగిసిన చర్చలు !

J.SURENDER KUMAR,

ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. శుక్రవారం ఉదయం 11 గంటల నుండి అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా జరి గిన చర్చల అనంతరం సమ్మె విరమిస్తు న్నట్లు కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు.

👉 చర్చలలో ప్రభుత్వం అంగీకరించిన డిమాండ్లు ఇవి!

👉ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి అంగీకారం !

👉 క్యాబినెట్ సబ్ కమిటీ.. జూన్ 2న విలీన ప్రకటన

👉 ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలకు సమ్మతి !

👉 28 డిమాండ్లు అంగీకరించిన ప్రభుత్వం!

  👉 సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం ఆర్టీసీ జేఏసీ నేతలతో ప్రారంభమైన సమావేశం..

👉 సమావేశంలో పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు , వివేక్ వెంకట్ స్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్

👉 సమావేశానికి హాజరైన  చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు ,స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, సందీప్ కుమార్ సుల్తానియా , దానాకిషోర్,ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి .

👉 సమావేశం ప్రారంభం కాగానే ఆత్మహత్య చేసుకున్న నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ కి సంతాపం వ్యక్తం చేస్తూ 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించిన మంత్రులు , అధికారులు, జెఏసీ నేతలు..