అభినవ ఘంటసాల అమరుడయ్యాడు !

J.SURENDER KUMAR ,

తెలుగు రాష్ట్రాలలో అభినవ ఘంటసాలగా గుర్తింపు పొందిన  ధర్మపురి క్షేత్ర వాసిప్రముఖ గాయకుడు గుండి శంకర్ శర్మ (70 ) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు..

ఉత్తర తెలంగాణలో  ఏ ప్రాంతంలో సంగీత విభవరి జరిగిన ముందుగా ధర్మపురి కి చెందిన గుండి శంకర్ శర్మ ను నిర్వాహకులు ఆహ్వానించేవారు.

శంకర్ శర్మ, ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పై కవి శేషప్ప రచించిన, “భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార దురితదూర ” ,మకుట సీస పద్యాలు, సాహిత్య సంగీత అభిమానులు శంకర్ శర్మతో పాడించుకుని రికార్డ్ చేసుకుని భద్రపరుచుకున్నారు. 


శుక్రవారం సాయంత్రం గోదావరి నది తీరంలో శంకర్ శర్మ అంతిమ సంస్కారం జరిగింది.. భారీ సంఖ్యలో అభిమానులు, సంగీత సాహిత్య ప్రియులు పాల్గొన్నారు.  గాయకుడు శంకర్ శర్మ భౌతికం లేకున్నా ఆయన పాడిన పాటలు శాశ్వతంగా చిరస్థాయిగా నిలిచి నిత్యం ఆయన గానం చేసిన పాటలల్లో కనిపిస్తారని సంగీత ప్రియులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.