రైతు భరోసా కార్యక్రమం విజయవంతం చేయాలి !

👉 మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు !

J SURENDER KUMAR,

కాటారంలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి  రైతు భరోసా విడుదల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి ఇది శ్రీధర్ బాబు అన్నారు.

మంథని లోని మంత్రి శ్రీధర్ బాబు క్యాంప్ కార్యాలయంలో శనివారం ఈనెల 20న  సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష సమావేశం  ఏర్పాటు చేశారు.

ఈనెల 20 న కాటారం మండలం నస్తూరుపల్లి  సాయంత్రం నాలుగు గంటలకు జరుగు భారీ సభ లో ముఖ్యమంత్రి  ఏనమల రేవంత్ రెడ్డి  ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి . వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు మరియు మంత్రివర్గ సహచరులు. ఎమ్మెల్యేలు  తదితరులు  పాల్గొంటారని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ,….

రైతు భరోసా పథకం రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో మంథని, రామగిరి, కమాన్పూర్, ముత్తారం. పాలకుర్తి మండలాల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు పాల్గొనేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి  పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమం సజావుగా జరిగేలా బాధ్యతలు కేటాయించి, ప్రతి ఒక్కరు తమ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని మంత్రి కోరారు.