J SURENDER KUMAR,
విద్యుత్ ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబానికి రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం పరిహారం చెక్కులను అందించారు..
మూడు సంవత్సరాల క్రితం ధర్మపురి మండలం రాయపట్నం గ్రామానికి చెందిన గటిక చిన్నయ్య విద్యుత్ షాక్ తో మృతి చెందారు.. మృతుడి భార్య గటిక అమ్మాయికి ₹ 5 లక్షల పరిహారాన్ని రాయపట్నం లో మంత్రి అందించారు.

వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామానికి చెందిన. రాపాక మహేందర్, గేదె విద్యుత్ షాక్ తో మరణించడంతో ప్రభుత్వం తరఫున ₹40 వేల పరిహారాన్ని మంత్రి అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, జగిత్యాల జిల్లా ట్రాన్స్ కో ఎస్ఈ సుదర్శనం, డీఈ గంగారం, గ్రామ సర్పంచ్ మొగిలి తదితరులు పాల్గొన్నారు.
