👉 ధర్మారం మండల కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటు.!
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లోకి వస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో ₹ కోటి 74 లక్షల తో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేయడంతో పాటు ధర్మారం వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ తో కలిసి మంత్రి పంపిణీ చేశారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ……
ధర్మారం మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నానని మంత్రి అన్నారు. ధర్మారం మండలంలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక నిధులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు.

👉 ధర్మారం ప్రాంతంలోని విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలని లక్ష్యంతో ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.
👉 ధర్మారం మండల కేంద్రంలోని ఎస్టీ మినీ గురుకుల పాఠశాలను పదవ తరగతి వరకు అప్ గ్రేడ్ చేశామని పదో తరగతి వరకు మినీ గురుకుల పాఠశాలలో సీట్లు 25 శాతం ఇతర వర్గాలకు 75శాతం ట్రైబల్ విద్యార్థులకు కేటాయిస్తామని మంత్రి వివరించారు.

👉 ధర్మారం మండల కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. మండలంలోని అన్ని గ్రామాల్లోని యువత వివిధ రకాల క్రీడల్లో రాణించడానికి మిని స్టేడియం ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు.

👉 పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. గ్రామ సమస్యలపై ప్రజలు ఎవరు తన కోరకు హైదరాబాద్ వంటి ప్రాంతాలకు రావద్దని వారంలో మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి తెలిపారు.

👉 ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. మండలంలో మొక్కజొన్న సాగుచేసిన రైతులు ఏలాంటి ఆందోళన చెందవద్దని ఇప్పటికే జగిత్యాల జిల్లాలో ప్రభుత్వం తరఫున 6 మక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని అవసరమైన పక్షంలో ధర్మారం మండల కేంద్రంలో మక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
👉 గత ప్రభుత్వ కాలంలో రైతులను ఏనాడు పట్టించుకోలేదని, రేవంత్ రెడ్డి నాయకత్వం ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలో రైతులకు రాయితీ ద్వారా పనిముట్లను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
👉 ఇందులో భాగంగా ధర్మారం మండలంలోని 61 మంది రైతులకు ₹.18.24 లక్షల విలువైన వ్యవసాయ పరికరాలను ఈ సందర్భంగా మంత్రి అందజేశారు. మండలంలోని 23 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను ఒకరికి షాదీ ముబారక్ చెక్కు తో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఈ సందర్భంగా మంత్రి పంపిణీ చేశారు.
