స్వీయ గణన నమోదు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి!

👉 ఆదివారం నుంచి  ఆన్‌లైన్‌లో స్వీయ గణన ప్రారంభం !

J.SURENDER KUMAR,

జనగణనలో భాగంగా ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  సెల్ఫ్ ఎన్యుమరేషన్ (స్వీయ గణన) లో పాల్గొని వివరాలను నమోదు చేసుకున్నారు. జనగణన 2027 లో భాగంగా తెలంగాణలో ఆదివారం నుంచి  ఆన్‌లైన్‌లో స్వీయ గణన ప్రారంభమైంది.


👉  వెబ్‌సైట్‌లో ముఖ్యమంత్రి  వివరాలను స్వీయ నమోదు చేసుకున్నారు. అత్యంత కీలకమైన ఈ కార్యక్రమంలో ప్రజలంతా విశేషంగా పాల్గొనాలని వివరాలను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.


👉  జనాభా లెక్కల కార్యక్రమంలో ముందుగా చేపట్టిన సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమానికి సంబంధించి సెన్సస్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.


👉 ఈ కార్యక్రమంలో డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోళికేరి , జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ , జాయింట్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ ప్రియాంక ఆల , సమాచార పౌర సంబంధాల కమిషనర్‌ సీహెచ్. ప్రియాంక తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.