తెలంగాణ పథకాలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకం!

👉 చండీగఢ్‌లో చింతన్ శివిర్‌లో …. మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

విద్య నైపుణ్య అభివృద్ధి తో బలహీన వర్గాల ఉపాధి అవకాశాలు విస్తరణ చేయడం వల్ల ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని,
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న వినూత్న సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకం అని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ  సంక్షేమ శాఖ మంత్రి మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్  అన్నారు.

కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “చింతన్ శివిర్” సదస్సు ఆదివారం హర్యానా రాష్ట్రం లోని చండీగఢ్‌లో జరిగింది. ఈసదస్సుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు.

దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం, సంక్షేమ పథకాల సమర్థ అమలు, బలహీన వర్గాల సమగ్ర అభివృద్ధి వంటి కీలక అంశాలపై సదస్సులో విస్తృతంగా చర్చించారు.

తెలంగాణతో పాటు ఉత్తర ప్రదేశ్, నాగాలాండ్, ఒడిశా, మేఘాలయ, అస్సాం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, అదనపు కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, ఉపసంచాలకులు చింతనతో శివిర్ లో పాల్గొన్నారు.

👉 సదస్సు లో పాల్గొన్న మంత్రి లక్ష్మణ్ కుమార్  పలు  సూచనలు చేశారు….

సామాజిక న్యాయ రంగంలో కేంద్ర-రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

👉 ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగుల సంక్షేమానికి బడ్జెట్లో మరిన్ని నిధులు కేటాయించి వారి సంక్షేమానికి కృషి చేయాలని  సూచించారు.

👉 విద్య, నైపుణ్యాభివృద్ధి పెంపొందించడం ద్వారా ఉపాధి అవకాశాల విస్తరించి బలహీన వర్గాల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వాలు కృషి చేయాలని అభిప్రాయపడ్డారు.

👉 సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, వేగవంతం కోసం డిజిటల్ విధానాలను విస్తృతంగా వినియోగించాలని మంత్రి అభిప్రాయపడ్డారు.

👉 ఈ చింతన్ శివిర్ ద్వారా రాష్ట్రాల మధ్య ఉత్తమ విధానాలను అమలుకు అలాగే కార్యాచరణలో సమన్వయం సాధించేందుకు ప్రయోజనకరమైన వేదికగా నిలిచిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వివరించారు.

👉 సమాజంలోని పేద, వెనుకబడిన మరియు బలహీన వర్గాల కోసం సమ్మిళితం, సాధికారత పై క్షేత్రస్థాయి ఫలితాలపై నిరంతరంగా దృష్టి సారించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.

👉 దివ్యాంగులకు చేయూత కింద 4.74 లక్షల మందికి నెలకు ₹ 4,016 చొప్పున అందిస్తున్నాం.

👉 ప్రతి సంవత్సరం  ₹ 574 కోట్ల వ్యయంతో 3.39 లక్షల మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు చెల్లిస్తున్నామన్నారు.

👉 కల్యాణలక్ష్మి పథకం కింద 47,539 మంది లబ్ధిదారులకు ₹.476 కోట్లు పంపిణీ చేశాం.

రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్య క్రమాలకు కేంద్రం నుంచి సహకారం అందించాలి అని మంత్రి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.