J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి నవరాత్రి ఉత్సవాలు బుధవారం తెల్లవారుజామున నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి.

ఉదయము తెల్లవారుజామున ఆలయాల అర్చకులు మంగళ వాయిద్యములతో గోదావరి నదికి వెళ్ళి గోదావరిలో పూజలు నిర్వహించి బిందె తీర్థము తెచ్చారు. నవరాత్రి ఉత్సవాలు తిలకించడానికి భారీ సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు.


పుణ్యాహవచనము, ఋత్విక్వరణము, కలశస్థాపన, అభిషేకము, వేదోక్తముగా సహస్ర కలశస్థాపన, నవగ్రహ యోగిని, వాస్తు, క్షేత్రపాలక స్థాపనలు అర్చనాది ఆరాధనా కార్యక్రమము నిత్య హోమములు నిర్వహించారు.

👉 దర్శించుకున్న జగిత్యాల ఎమ్మెల్యే !

బుధవారం సాయంత్రం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.. ఆలయ అర్చకులు, వేద పండితులు ఎమ్మెల్యే ను ఆశీర్వదించి స్వామి ప్రసాదం, శేష వస్త్రం బహుకరించారు.
