ధర్మపురి నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం!

J.SURENDER KUMAR,

నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి పట్టణానికి నూతనంగా మంజూరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.

గత కొన్ని నెలల క్రితం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నుంచి డిగ్రీ కళాశాలను మంజూరు చేయించారు.

👉 కళాశాలలో అడ్మిషన్లు పొందడానికి  ” దోస్త్ ” ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

👉 కళాశాల కోడ్ 7193

👉 విద్యార్థులకు అందుబాటులో ఉన్న కోర్సుల వివరాలు..

👉 B. A, CBCS (E/M)

👉 B. Com  (Computer Applications) CBCS (E/M)

👉 B.Sc ( Life sciences) CBCS (E/M)

👉B.Sc ( Physical Sciences) CBCS (E/M)

👉 College Code 7193.

👉 వివరాల కోసం సంప్రదించాల్సిన..

👉 ప్రిన్సిపల్, అశోక్, 98484 15835.

తాత్కాలికంగా, స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల గదులలో తరగతులు ప్రారంభించనున్నారు.

👉 ధర్మపురి నియోజకవర్గం చదువుల తల్లికి నిలయంగా మారాలి !

👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ !

పవిత్ర గోదావరి తీరాన ఉన్న మన ధర్మపురి నియోజకవర్గం చదువుల తల్లికి నిలయంగా మారాలి. మన బిడ్డలు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి అని మంత్రి లక్ష్మణ్ కుమార్, ప్రకటనలో విజ్ఞప్తి చేశారు..

పేదరికం ఏనాడూ చదువుకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశ్యంతో, వచ్చే విద్యాసంవత్సరం నుండి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మార్గదర్శనంలో ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దుతున్నాం. మీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కల్పిస్తున్న ఈ  సదుపాయాలను మీర గమనించాలని మంత్రి  ప్రకటనలో పేర్కొన్నారు.

👉  ఉచిత పౌష్టిక అల్పాహారం మరియు పాలు!

మీ బిడ్డలు కడుపునిండా తిని చదువుకోవాలి. అందుకే మధ్యాహ్న భోజనంతో పాటు వచ్చే విద్యాసంవత్సరం నుండి ఉదయం పూట పౌష్టికరమైన అల్పాహారం మరియు ప్రతిరోజూ విజయా డెయిరీ పాలు, రాగి జావ బడిలోనే ఉచితంగా అందిస్తున్నాం.

👉 పూర్తి స్థాయి స్టూడెంట్ కిట్స్ పంపిణీ  బడి తెరిచిన మొదటి రోజే మీ పిల్లలకు ఉచితంగా రెండు జతల యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నాణ్యమైన స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్స్ మరియు జామెట్రీ బాక్స్‌లతో కూడిన కిట్‌ను నేరుగా వారి చేతుల్లో పెడుతున్నాం.

👉 ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’ల ద్వారా వసతులు !

మన బడుల నిర్వహణ బాధ్యతను తల్లులైన మీకే అప్పగిస్తున్నాం. మీ కమిటీల ద్వారానే పాఠశాలల్లో త్రాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, కరెంటు మరియు మౌలిక వసతుల ఏర్పాటు జరుగుతుంది.

👉 ఆధునిక కంప్యూటర్ మరియు AI విద్య !

మన ధర్మపురి నియోజకవర్గ పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలి. అందుకే ప్రతి ఉన్నత పాఠశాలలో డిజిటల్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు కంప్యూటర్ కోడింగ్ క్లాసులు ప్రభుత్వ బడిలోనే నేర్పిస్తున్నాం.

👉 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం:

విశాలమైన ఆటస్థలాలు, డిజిటల్ తరగతి గదులతో కూడిన నూతన ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ ను మన నియోజకవర్గంలో కూడా అందుబాటులోకి తెస్తున్నాం.

👉 నా ఆత్మీయ ధర్మపురి నియోజకవర్గ ప్రజలారా..

మీ బిడ్డల విద్యా బాధ్యత ప్రభుత్వానిది, నాది. అత్యుత్తమ వసతులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్న మన ప్రభుత్వ పాఠశాలల్లోనే మీ పిల్లలను చేర్పించండి. మన ధర్మపురిని విద్యా రంగంలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలుపుకుందాం. అంటూ ప్రకటనలో పేర్కొన్నారు.