J . SURENDER KUMAR,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో శనివారం శాసనమండలి, శాసనసభ విప్‌లతో సమావేశమయ్యారు. ప్రజా సమస్యలపై వారితో చర్చించారు. ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్‌లేనని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింతగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని సూచించారు.
ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ విప్‌లు మరింత చురుకుగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరిస్తుందన్న నమ్మకం ప్రజల్లో కల్పించాలని చెప్పారు.
👉 వేసవి నేపథ్యంలో నియోజకవర్గాల్లో తాగునీరు, సాగునీటి అవసరాలకు తీసుకోవాల్సిన చర్యలు, ధాన్యం సేకరణలో పురోగతి వివరాలను విప్‌లు ముఖ్యమంత్రి కి తెలిపారు. ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతో పాటు సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు.
👉 క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు విషయాలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తేవాలని ముఖ్యమంత్రి చెప్పారు. క్షేత్రస్థాయి విషయాలు, ప్రజా సమస్యలు తెలసుకునేందుకు వారంలో ఒక రోజు విప్‌లు అందుబాటులో ఉంటానని తెలిపారు.
👉 ఈ సమావేశంలో పార్టీ ఎంపీ వేం నరేందర్ రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్‌లు అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ , ఆది శ్రీనివాస్ , బీర్ల ఐలయ్య , యెన్నం శ్రీనివాస్ రెడ్డి , విజయరమణరావు , రామచంద్రు నాయక్, వేముల వీరేశం , పాల్గొన్నారు.
