👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
జగిత్యాలకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంచాల రామేశం మృతి ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటు అని
రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అన్నారు.
స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో కలిసి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, రామేశం చిత్రపటానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మంచాల రామేశం ఆధ్యాత్మిక సేవలు, సామాజిక చైతన్య కార్యక్రమాల ద్వారా ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారని అన్నారు.
ఆయన మరణం ఆధ్యాత్మిక రంగానికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా తీరని లోటని పేర్కొన్నారు.
రామేశం జ్ఞాపకార్థం ప్రజల సౌకర్యార్థం స్వచ్ఛ తాగునీటి ఆర్‌ఓ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి అన్నారు. సమాజ సేవ పట్ల కుటుంబ సభ్యులు చూపుతున్న నిబద్ధత ఆదర్శప్రాయమని కొనియాడారు.

ఈ సందర్భంగా మంచాల రామేశం తనయుడు మంచాల కృష్ణ, హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్‌కు సంబంధించిన “Heartfulness Meditation Practices” పుస్తకాన్ని మంత్రికి బహుకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆధ్యాత్మికవేత్తలు, కుటుంబ సభ్యులు మరియు అభిమానులు పాల్గొన్నారు.
