👉 చట్ట ప్రకారం పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది !
👉 ధర్మపురి క్షేత్ర అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజల సహకారాలందించాలి !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్ర అభివృద్ధికి భూనిర్వాసితుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ముందుకు సాగుతామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్ర అభివృద్ధి, పుష్కర ఏర్పాట్లపై శుక్రవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, సంబంధిత అధికారులు, భూనిర్వాసితులతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురిలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

భూ నిర్వాసితుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర అభివృద్ధికి ముందుకు సాగుతామని అన్నారు.
👉 2017 -18 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉందని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
👉 ప్రజా పాలనలో ప్రజలు ఎవ్వరిని ఇబ్బందులకు గురి చేయమని మంత్రి అన్నారు. ఇప్పటికే పలుమార్లు భూ నిర్వాసితులతో నెలలుగా చర్చలు జరిపామని శనివారం మరో దఫా చర్చలు నిర్వహిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
👉 ధర్మపురి క్షేత్ర అభివృద్ధి కోరకు స్థానికులంతా సహకరించాలని ఎవరు క్షేత్ర అభివృద్ధిలో రాజకీయాలు చేయద్దని ఈ సందర్భంగా కోరారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయలే కానీ అభివృద్ధి విషయంలో ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
👉 దేశం నలుమూలల నుండి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రానికి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడమే తమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఆలయ అభివృద్ధి కొరకు సేకరిస్తున్న భూములు, ఇల్లు కోల్పోతున్న వారు పెద్ద మనసుతో సహకరించాలని మంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

👉 2027 గోదావరి పుష్కరాలకు ₹117కోట్లు !
2027 జూన్ లో నిర్వహించే గోదావరి పుష్కరాలకు మొదటి విడతగా ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి, కోటి లింగాలకు ₹ 117 కోట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేటాయించారని తెలిపారు.
పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా బైపాస్ రోడ్లు, పార్కింగ్ స్థలాలు, పుష్కర ఘాట్లు నిర్మిస్తున్నామని తెలిపారు.
మరిన్ని సౌకర్యాల కోసం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆధ్వర్యంలో నేడు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిస్తున్నామని త్వరలోనే నిధులు సాధించి పుష్కరాలకు ముందే పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
👉 కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ…

ప్రభుత్వ నిబంధనల మేరకు భూనిర్వాసితుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి పనులు చెప్పడతామని అన్నారు.
2017 – 2018 భూ సేకరణ చట్టం ప్రకారం భూ నిర్వాసితులకు ప్రభుత్వం అందించే పరిహారం పారదర్శకంగా అందిస్తామని అన్నారు.
అదేవిధంగా 2027 గోదావరి పుష్కరాలకు రానున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వాటి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
ఇప్పటివరకు ప్రభుత్వం ₹ 117 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని తెలిపారు.
సమీక్ష సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, దేవాదాయ శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, ఇరిగేషన్ శాఖ అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు మరియు తదితరులు పాల్గొన్నారు.
