J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తుల సౌకర్యార్థం, ఆలయానికి దాతలు ₹ 17 లక్షల 38 వేల విలువ గల 180 కేవీ సామర్థ్యం గల ఐచర్ కంపెనీ నూతన జనరేటర్ ను బుధవారం బహుకరించారు అని కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
ఆలయంలో గత కొన్ని సంవత్సరాలుగా 20 కేవీ జనరేటర్ ను వినియోగిస్తున్నారు చిన్న చిన్న మరమ్మతుల కారణంగా పలుమార్లు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడేది…ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, స్వామివారి దర్శనంకు వచ్చిన దాతలకు జనరేటర్ గురించి వివరించారు.

దాతలు బీగాల గణేష్ గుప్తా ( నిజామాబాద్) ₹,7,37,000/-నల్లాల మహిపాల్ రెడ్డి,( నిజామాబాద్) ₹ 5, లక్షలు,
బెజుగం అశోక్ గుప్త, ( నిజామాబాద్ ) ₹ 1 లక్ష ఒక వేయి.
జీవి రాజేశ్వర్ రెడ్డి, ( హైదరాబాద్ ) ₹, 1 లక్ష,చంద్రకాంత్ క్రిచ గందేవార్ (నాందేడ్) ₹,1 లక్ష, పాలకుర్తి శ్యాం కుమార్,( హైదరాబాద్) ₹ 1 లక్ష అప్పి రెడ్డి మోహన్ రెడ్డి (నిజామాబాద్) ₹ 1 లక్ష జక్కుల నరేందర్,( ఆదిలాబాద్ ) ₹ 60, వేలు ఇచ్చిన విరాళాలతో జనరేటర్ కొనుగోలు చేసినట్టు ఈవో తెలిపారు.
త్వరలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జనరేటర్ ను ప్రారంభించనున్నారని ఈవో ప్రకటనలో పేర్కొన్నారు.
