👉 ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండిస్తూ జగిత్యాలలో భారీ నిరసన ర్యాలీ, ధర్నా !
👉 ప్రశ్నపత్రం లీకేజీపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, డిమాండ్ !
J.SURENDER KUMAR,
నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టిందని, ఈ అంశంపై నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై లాఠీచార్జ్ జరగడం అత్యంత దురదృష్టకరమని,విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు.

ఢిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమం సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్యతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…..
దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది నిర్వహించే నీట్-యూజీ పరీక్షకు లక్షలాది మంది విద్యార్థులు హాజరవుతున్నారని, అలాంటి కీలక పరీక్షను అత్యంత పారదర్శకంగా నిర్వహించే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రశ్నపత్రం లీకేజీపై దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పరీక్షా వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఏర్పడిన అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు.

👉 ఈఏడాది నీట్ యూజీ పరీక్షలకు 22 లక్షల, 79వేల 743మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరుకావడానికి రిజిస్టేషన్ చేసుకున్నారని, 19 లక్షల 99వేల,895 మంది విద్యార్ధులు విద్యార్ధులు పరీక్షలకు హాజరు అయ్యారని తెలిపారు.
👉 తెలంగాణ రాష్ర్టం నుంచి 73,084 మంది విద్యార్ధులు హాజరు అయ్యారని పరీక్ష పత్రం లీకేజీ వలన ఇప్పటి వరకు 12మంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
👉 లక్షల మంది విద్యార్ధుల భవిష్యత్.. వారి తల్లిదండ్రల కళలను సహకారం చేసుకునే ఈపరీక్షను ఎంతో జాగ్రత్తగా నిర్వహించాల్సిన బాధ్యత కేంద్రం ప్రభుత్వంపై ఉందని
కాని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరీక్షను పారదర్శకంగా నిర్వహించానికి ఏలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పరీక్ష ప్రశ్న పత్రాలు పల్లి, బాఠాణీ అమ్మినట్లు ప్రశ్న పత్రాలను అమ్ముకున్నారని మంత్రి అడ్లూరి అన్నారు.

👉 సోషల్ మీడియా మరియు టెలిగ్రామ్ ద్వారా లీక్ అయిన ప్రశ్నలు పిడిఎఫ్ (PDF) రూపంలో టెలిగ్రామ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు విక్రయించినట్లు కేంద్ర దర్యాప్తు సంస్ధ సీబీఐ ఆధారాలు సేకరించిందని మంత్రి అడ్లూరి అన్నారు.
👉 నీట్ యూజీ ప్రశ్నపత్రాల రూపకల్పన, అనువాద ప్రక్రియ మరియు పరీక్షా ప్యానెల్‌లోని సబ్జెక్ట్ నిపుణులు/కోచింగ్ నిర్వాహకులు ఈ లీకేజీలో కీలక పాత్ర పోషించినట్లు బీజేపీ జేబు సంస్ధగా చెప్పుకునే సీబీఐ దర్యాప్తులో తేల్చిందని
ఢిల్లీ, జైపూర్, పుణే, లాతూర్, గురుగ్రామ్ తదితర ప్రాంతాల్లో లెక్చరర్లు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు మరియు దళారులను సీబీఐ అరెస్ట్ చేసింది నిజం కదా అని మంత్రి ప్రశ్నించారు.

👉 సీబీఐ దర్యాప్తులో పరీక్ష పత్రం లీక్ అయినట్లు తెలిన కేంద్ర విద్యా శాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయడం లేదని మంత్రి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో నీట్, యూజీ పరీక్ష పత్రం లీక్ కావడంతో విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నారని మంత్రి అన్నారు.
👉 పరీక్షల్లో అక్రమాలు చోటుచేసుకోవడం వల్ల సంవత్సరాల పాటు కష్టపడి చదివిన విద్యార్థుల శ్రమ వృథా అవుతోందని, వారి మానసిక ఆందోళనను కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని మంత్రి పేర్కొన్నారు. పరీక్షా విధానంలో పారదర్శకత తీసుకువచ్చి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు.
👉 నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో సమగ్ర చర్చకు అంగీకరించాలని, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్ చేశారు.

👉 అదేవిధంగా, విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా నిర్వహించిన నిరసనలపై లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, విభిన్న అభిప్రాయాలను అణచివేయకుండా ప్రభుత్వం స్పందించాలని ఆయన కోరారు.
👉 ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టును కూడా ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైన చర్యగా అభివర్ణిస్తూ, ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల హక్కులు, వారి భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
👉 ధర్నా సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, విద్యార్థుల హక్కులను పరిరక్షించాలని, పరీక్షా వ్యవస్థలో పూర్తి పారదర్శకత తీసుకురావాలని డిమాండ్ చేశారు.
