సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డిజిటల్ కేబినేట్‌ సమావేశం !

👉 పేపర్ లెస్ విధానంలో క్యాబినెట్ సమావేశాలు నిర్వహణకు తీర్మానం !


J.SURENDER KUMAR,


  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో గురువారం  డిజిటల్ క్యాబినెట్ సమావేశం జరిగింది. రాష్ట్ర మంత్రిమండలి సమావేశాలను పేపర్ లెస్ విధానంలో నిర్వహించాలని మంత్రుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.


👉 మంత్రివర్గ సమావేశాలను తెలంగాణ డిజిటల్ కేబినేట్‌గా నిర్వహించడానికి వీలుగా పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు  సమావేశంలో ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులందరికీ ప్రత్యేకంగా ట్యాబ్‌లను అందజేశారు.


👉 మంత్రిమండలి సమావేశాల నిర్వహణకు సంబంధించిన డిజిటల్ విధానాన్ని ట్యాబ్‌ల ద్వారా సమావేశంలో ప్రదర్శించి పరిశీలించారు. ఇక నుంచి ఈ-బుక్ ద్వారానే మంత్రిమండలి సమావేశం ఎజెండా, సంబంధిత నోట్స్ అన్నీ కూడా మంత్రులకు అందుబాటులో ఉంచనున్నారు.