ధర్మపురి ఆలయ ఉద్యోగులు ఖుషి ఖుషి !

👉  పైరవి కారుల ప్రమేయం లేకుండా 50 మంది కి పెరిగిన జీతాలు !

👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగులు !

J.SURENDER KUMAR,

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దశాబ్ద కాలంకు పైగా  తాత్కాలిక ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న అర్చకులు, వేద పండితులు, కార్యాలయ సిబ్బంది ఎలక్ట్రిషన్, ప్లంబర్, నైట్ వాచ్ మెన్ స్వీపర్ల జీతాలు , పైరవి కారుల ప్రమేయం లేకుండా 50 మందికి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవతో జీతాలు పెరగడంతో వారు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

ఆలయంలో విధులు నిర్వహిస్తున్న 15 మంది స్వీపర్లకు ₹ 9 వేల జీతం నుండి  ₹ 12 వేల కు  పెంచుతూ దేవదాయ శాఖ డైరెక్టర్  ఎం హనుమంతరావు   ఈనెల 11న ఉత్తర్వులు జారీ చేశారు.

పెరిగిన జీతాల ఉత్తర్వులు!

2009 సంవత్సరం నుండి స్వీపర్లుగా పనిచేస్తున్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో జీతాలు పెంపుదలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న తమ మొర ఆలకించే వారే లేరని స్వీపర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

జీతాలు జరిగిన స్వీపర్లు వీరు..

13 మంది కార్యాలయ సిబ్బంది, ముగ్గురు రికార్డు అసిస్టెంట్లు, ఒక నైట్ వాచ్మెన్, ప్లంబర్ ఎలక్ట్రిషన్లకు ₹ 15 వేల చొప్పున జీతాలు పెంచుతూ గత సంవత్సరం మే 3 న లేఖ సంఖ్య LDis.No.B1/1816/2023 ద్వారా మంత్రి ఉత్తర్వులు జారీ చేయించారు.

2025 లో 20 మందికి జీతాలు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులు(ఫైల్ ఫోటో)

6 గురు అర్చకులకు, నెలకు  ₹ 20 వేల చొప్పు న,  ముగ్గురు పరిచారిక, సహాయపరిచారులకు,₹ 15 వేల చొప్పున జీతాలు పెంచుతూ మంత్రి లక్ష్మణ్ కుమార్ లేక సంఖ్య. L.Dis.No.B1/16543/2022,  మే 28 2025 న ఉత్తర్వులు జారీ చేయించారు.

10 మంది తాత్కలిక అర్చకులకు 2025 మే మాసంలో పెంచిన జీతాలు ఉత్తర్వులు ( ఫైల్ ఫోటో)

తాత్కాలిక ఉద్యోగులు దాదాపు 50 మంది కాగా గత పది సంవత్సరాలుగా జీతాలు పెంచాల్సిందిగా వేడుకుంటున్న వారి జీతాలు పెరగలేదు.

ఇదిలా ఉండగా స్వామివారి నిత్య ఉత్సవాలు జరుగుతాయి  ఈ సందర్భంగా   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సేవ పల్లకిని అనాదిగా వంశపార్యం పరంగా 100 కుటుంబాలకు చెందిన బోయలు మోస్తుంటారు.. వారికి ఆలయం నుంచి చెల్లించే సంభావన ( పారితోషికం) మంత్రి లక్ష్మణ్ కుమార్ చొరవతో రెండింతలు పెరిగింది.

అనేక సందర్భాలలో ఆలయంలో విధులు నిర్వహిస్తున్న తాత్కాలిక ఉద్యోగులు తమ జీవితాలు పెంచాల్సింది మంత్రి లక్ష్మణ్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు..

మధ్యవర్తుల, పైరవీకారుల ,ప్రమేయం లేకుండా ఆలయ ఆదాయం, 30% కు అధికమించని ఖర్చులు పరిశీలిస్తూ మంత్రి  వీరి జీతాలు పెంచాల్సిందిగా దేవాదాయ శాఖ అధికారులకు సూచనలు చేశారు.

👉 డిసి పరిధిలోకి చేరుస్తాను. మంత్రి లక్ష్మణ్ కుమార్ !

ధర్మపురి ఆలయ సిబ్బంది, ఉద్యోగులు, అర్చకులు ఆలయ ఆదాయం పెంచుతూ ఖర్చులు తగ్గిస్తూ, భక్తజనం పట్ల సేవా భావంతో ప్రవర్తించాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆలయ అధికారులకు సూచించారు. ప్రత్యేకంగా ఆలయ ప్రాంగణంలో పారిశుద్ధ్య పనులు చాలా బాగున్నాయని. ఆలయ ఆదాయం పెరిగితే ఈ ఆలయాన్ని డిప్యూటీ కమిషనర్ పరిధిలో చేర్చడంతో పాటు, ఆలయంలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు పెరగడం పెన్షన్స్ సౌకర్యం ఉంటుందని  అధికారులకు సూచించారు.