👉 బీజేపీ అధికార ప్రతినిధి అమర్ నాథ్ సారంగుల !
J.SURENDER KUMAR,
జాతీయ బయోఎనర్జీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వ్యర్థాలను (పశువుల పేడ, వ్యవసాయ అవశేషాలు, చెత్త) ఇంధనంగా మరియు ఆదాయ వనరుగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని బిజెపి తెలంగాణ అధికార ప్రతినిధి అమర్ నాథ్ సారంగుల తెలిపారు.
👉 పథకం ముఖ్య వివరాలు:
👉 మొత్తం బడ్జెట్ కేటాయింపు: ₹ 23,731 కోట్లు.
👉 అమలు కాలపరిమితి: 2026-27 ఆర్థిక సంవత్సరం నుండి 2035-36 వరకు (10 సంవత్సరాలు).

👉 నిర్వహణ మంత్రిత్వ శాఖ: పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ.
👉 ప్రధాన లక్ష్యం: దేశంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ఉత్పత్తిని దాదాపు 10 రెట్లు పెంచడం మరియు దిగుమతి చేసుకునే ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం.
పథకంలోని ప్రధాన అంశాలు (6 గ్రోత్ ఇంజిన్లు)
👉 కొనుగోలు హామీ (Assured Offtake):
సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) కంపెనీలు సీఎన్‌జీ (CNG) మరియు పీఎన్‌జీ (PNG) లలో బయోగ్యాస్‌ను తప్పనిసరిగా మిళితం (Blending Obligation) చేయాలని నిబంధన విధించారు (2026-27లో 3%, 2027-28లో 4%, 2028-29 నాటికి 5%).
👉 స్థిరమైన మద్దతు ధర (Stable Pricing):
ఉత్పత్తిదారులకు భరోసా నిమిత్తం ప్రతీ MMBTU (Metric Million British Thermal Unit) గ్యాస్‌కు ₹ 2,110 నిలకడైన ధరకు 10 సంవత్సరాల పాటు మార్కెట్ మద్దతు ధర నిర్ణయించారు.
👉 మూలధన సాయం (Capital Assistance):

కొత్తగా ఏర్పాటు చేసే సీబీజీ (CBG) ప్లాంట్లకు రోజుకు 1 టన్ను ఉత్పత్తి సామర్థ్యానికి గరిష్ఠంగా ₹ 2 కోట్ల వరకు సబ్సిడీ ఇస్తారు. పాత ప్లాంట్ల విస్తరణకు కూడా ఇది వర్తిస్తుంది.
👉 పైప్‌లైన్ మౌలిక వసతులు:
బయోగ్యాస్ ప్లాంట్ల నుండి రవాణా ఖర్చులు తగ్గించడానికి ప్రధాన పైప్‌లైన్ నెట్‌వర్క్‌లతో అనుసంధానించేందుకు నిధులు అందిస్తారు.
👉 క్రెడిట్ గ్యారెంటీ సహకారం:
చిన్న, మధ్య తరహా వ్యాపారవేత్తలకు బయోగ్యాస్ ప్లాంట్లు నెలకొల్పడానికి బ్యాంకుల నుండి రుణాలు సులభంగా లభించేలా గ్యారెంటీ సపోర్ట్ ఇస్తారు.
👉 ఫండ్ & సాంకేతిక అభివృద్ధి (Ecosystem Challenge Fund):
జిల్లా స్థాయిలో పేడ, వ్యవసాయ వ్యర్థాల సేకరణ, సాంకేతిక అభివృద్ధి మరియు శిక్షణ కోసం ప్రత్యేక ఫండ్ కేటాయించారు.
రైతులు మరియు దేశానికి చేకూరే ప్రయోజనాలు:
👉 అదనపు ఆదాయం:
👉 రైతులు తమ వద్ద ఉన్న పశువుల పేడ, చెరకు పిప్పి (Press mud), పంట వ్యర్థాలను విక్రయించి ఆదాయం పొందవచ్చు.
👉 సేంద్రీయ ఎరువులు (FOM): బయోగ్యాస్ తయారీ ప్రక్రియ తర్వాత వచ్చే సేంద్రీయ వ్యర్థాలను (Fermented Organic Manure) భూమికి ఎరువుగా వాడి నేల సారాన్ని పెంచవచ్చు.
👉 గ్రామీణ ఉపాధి!
బయో-మాస్ సేకరణ, రవాణా మరియు ప్లాంట్ల నిర్వహణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది.
👉 పర్యావరణ పరిరక్షణ: పంట వ్యర్థాలు/తగలేయడం వల్ల వచ్చే కాలుష్యాన్ని నియంత్రించవచ్చు.
