గ్రామాల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !


J . SURENDER KUMAR,

ధర్మపురి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి  కోట్లాది రూపాయల నిధులు కేటాయించి ప్రజల అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

పెగడపల్లి  మండలంఎంపీడీవో కార్యాలయంలో సోమ సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 68 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి (CMRF) చెక్కులు, 9 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ....

తనపై నమ్మకం ఉంచి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు సేవ చేయడం తన నైతిక బాధ్యత అని, పేద ప్రజల జీవితాల్లో ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి అన్నారు.

👉 ప్రతి పేద కుటుంబం కలగంటున్న సొంతింటి స్వప్నాన్ని సాకారం చేయడమే తన లక్ష్యమని, అందులో భాగంగా అర్హులైన నిరుపేదలకు జూలై నెల నాటికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.

👉 గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రవాణా సౌకర్యాల కోసం పెగడపల్లి మండలానికి ₹.2.51 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ నిధులతో గ్రామాల మధ్య రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టి ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తామని చెప్పారు.

👉 అదేవిధంగా, మండల వ్యాప్తంగా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని, రైతులకు నీటి ఇబ్బందులు లేకుండా చేసి వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.


👉 సాగునీటి వసతుల విస్తరణతో పెగడపల్లి మండలాన్ని సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.