హనుమాన్ విగ్రహ ఆవిష్కరణ లో పాల్గొనడం నా అదృష్టం !

👉  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలో సహస్ర లింగా దేవాలయ ఆవరణలో  శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహా ప్రతిష్ట కార్యక్రమం శుక్రవారం జరిగింది.  మంత్రి  లక్ష్మణ్ కుమార్,  స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రి కి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కి ఎమ్మెల్యే కు లు తీర్థ ప్రసాదాలు అందించారు.. అనంతరం నూతన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కి ప్రత్యేక పూజలు చేశారు.

👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….

ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ రైతులకు కరువు కాటకాలు రాకుండా చూడాలని భగవంతున్ని కోరుకున్నట్లు తెలిపారు.

👉 ఈ సందర్భంగా పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాగభూషణం జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ కి, జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ నాగభూషణం కి శుభాకాంక్షలు తెలిపారు

.

కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, ఆడువాల జ్యోతి, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.