👉 మంత్రి శ్రీధర్ బాబు..
J SURENDER KUMAR,
కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి పక్షపాతి అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గతంలో టీఆర్ఎస్, బీఆర్ ఎస్ ప్రభుత్వం ఇంటి సంస్థగా సింగరేణి సంస్థను ఉపయోగించుకుందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు.
సింగరేణి సంస్థలో 335 మందికి కారుణ్య నియామక పత్రాలను మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియామక పత్రాలను మంత్రులతో కలిసి ఉపముఖ్యమంత్రి, మంత్రులతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు అందజేశారు.
👉 ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ..
సింగరేణి సంస్థ పై మాజీ మంత్రి హరీష్ రావు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని సింగరేణి నుండి ఒక టన్ను బొగ్గు పక్కదారి పట్టించే అవకాశం లేదని మంత్రి అన్నారు. సింగరేణి సంస్థ పరిరక్షణ ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని గత ప్రభుత్వం సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను గుర్తించలేదని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత లాభాల వాటాలో కాంట్రాక్టు కార్మికులకు సైతం ₹ 5 వేలు చెల్లించామని మంత్రి అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సింగరేణిలో కొత్త పాలసీలు చేస్తే ఎవరు వద్దన్నారు అని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. రాష్ట్రం నుండి 8 మంది బిజెపి ఎంపీలు ఉన్నప్పటికీ సింగరేణి కార్మికుల ఇన్ కామ్ టాక్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని శ్రీధర్ బాబు ప్రశ్నించారు.
సింగరేణిలో బీఆర్ఎస్, బిజెపి ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
👉 మంత్రి పొన్నం ప్రభాకర్ !
తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులతో పాటు సింగరేణి కార్మికుల పోరాట పటిమ మరువలేనిదని రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ సింగరేణి సంస్థల్లో సుమారు 40 వేల చొప్పున కార్మికులు ఉన్నారని రెండు సంస్థలను కాపాడుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని మంత్రి పొన్నం అన్నారు.
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

సింగరేణి కార్మికులను రెచ్చగొట్టే విధంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సింగరేణి కార్మికులు బిడ్డగా కార్మికుల సమస్యలు తెలుసని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అడ్లూరి అన్నారు. కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని కార్మికుల కష్టాల్లో కాంగ్రెస్ పార్టీ భాగమై ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగరం ప్రేమ్ సాగర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ రావు, రామగుండం ఎమ్మెల్యే రాజు ఠాగూర్ తో పాటు సింగరేణి ఐ ఎన్ టీ సీ నాయకులు అధికారులు పాల్గొన్నారు.
