ఆలయాల అభివృద్ధి కోసం వేలాది కోట్లు ఖర్చు చేశాం !


👉 గోదావరీ పుష్కరాల కోసం ప్రభుత్వం ₹ 1,000 కోట్లు !


👉 ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క!


J.SURENDER KUMAR,


గత రెండున్నర సంవత్సరాలలో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల అభివృద్ధి, పునరుజ్జీవనం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ₹ 2,216 కోట్లు మంజూరు చేసిందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

మంచిర్యాల జిల్లా గూడెం  శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయలో శనివారం జరిగిన అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దాదాపు ₹ 70 కోట్ల పెట్టుబడితో ఈ ఆలయం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా రూపాంతరం చెందుతుందని అన్నారు.


సరస్వతీ పుష్కరాలు విజయవంతంగా నిర్వహించిన అనంతరం, రాబోయే గోదావరీ పుష్కరాల కోసం భక్తులకు అవసరమైన సౌకర్యాలు, స్నాన ఘాట్లు కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పుడు ₹ 1,000 కోట్లు కేటాయించిందని ఆయన అన్నారు.

గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని ఆలయాల అభివృద్ధిపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని, బాసర నుంచి భద్రాచలం వరకు విస్తరించి ఉన్న పుణ్యక్షేత్రాల సుందరీకరణకు ₹ 802 కోట్లు కేటాయించిందని భట్టి తెలిపారు.