👉 మంత్రి గా లక్ష్మణ్ కుమార్ పదవి చేపట్టి రేపటికీ ఏడాది !
👉 పోరాటాలు, ఓటములు, అవమానాలు, కేసులు అరెస్టులు ,ఆటుపోట్లు దాటుకుని రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో కీలక స్థానం !
👉 కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బంటు !
👉 మంత్రి అడ్లూరి రాజకీయ విజయ ప్రస్థానం!
J.SURENDER KUMAR,
రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న
మంత్రి లక్ష్మణ్ కుమార్, తన రాజకీయ ప్రస్థానంలో
పోరాటాలు, పట్టుదల, ప్రజా సేవల సమ్మేళనంగా నిలిచింది.
విద్యార్థి దశలోనే ఎన్‌ఎస్‌యూఐ నాయకుడిగా
ప్రజా సమస్యలపై గళం విప్పిన లక్ష్మణ్ కుమార్,
నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మంత్రివర్గంలో కీలక మంత్రిగా
కొనసాగుతూ ప్రజల అభినందనలు అందుకుంటున్నారు.
👉 విద్యార్థి ఉద్యమాల నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన లక్ష్మణ్ కుమార్, ధర్మారం జెడ్పీటీసీగా ప్రజాప్రతినిధి జీవితాన్ని ప్రారంభించారు.
👉 అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించి తన పరిపాలనా సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు.
👉 2009లో నూతనంగా ఏర్పడిన ధర్మపురి రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
👉 అనంతరం పార్టీ ఆదేశాల మేరకు ఉప ఎన్నికల్లోనూ పోటీ చేశారు. రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కాంగ్రెస్ పార్టీని వీడకుండా పార్టీ కీ నమ్మిన బంటు గా నమ్మకంగా నిలిచారు.
👉 అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేధింపులు, అక్రమ కేసులు, అరెస్టులు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ రాజకీయ అవకాశాల కోసం పార్టీ మారలేదు.

👉 ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేశారు. ఈ పోరాటాలే ఆయన ఎదుగుదలకు బలమైన పునాదులయ్యాయి.
👉 2014 ఎన్నికల్లో మరోసారి ధర్మపురి నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి చెందారు. అయితే 2018 ఎన్నికల్లో అప్పటి చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్‌కు గట్టి పోటీ ఇచ్చి విజయం సాధించినప్పటికీ, ఎన్నికల ప్రక్రియలో చోటుచేసుకున్న వివాదాస్పద పరిణామాల నేపథ్యంలో ఓడినట్లు ప్రకటించబడింది.
👉 దీనిపై న్యాయపోరాటం చేపట్టిన లక్ష్మణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు స్ట్రాంగ్‌రూమ్‌ల పరిశీలన, ఎన్నికల ప్రక్రియపై విచారణ జరగడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
👉 ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న లక్ష్మణ్ కుమార్‌కు 2023 అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ మలుపు తిప్పాయి. ధర్మపురి సిట్టింగ్ ఎమ్మెల్యే, అప్పటి క్యాబినెట్ మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై 22 వేలకుపైగా ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించి ప్రజా నాయకుడిగా తన సత్తాను చాటుకున్నారు.
👉 రాజకీయంగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం, గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండటం, ప్రతీకార రాజకీయాలకు అవకాశం ఇవ్వకపోవడం లక్ష్మణ్ కుమార్ ప్రత్యేకతగా చెప్పవచ్చు.
👉 ప్రజల మధ్యే ఉంటూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వడం ఆయన రాజకీయ తత్వానికి అద్దం పడుతుంది.
👉 జూన్ 8తో మంత్రి పదవిలో ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా లక్ష్మణ్ కుమార్ రాజకీయ ప్రయాణం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
👉 విద్యార్థి నాయకుడిగా ప్రారంభమైన ప్రస్థానం నేడు మంత్రి పదవికి చేరుకోవడం వెనుక ఉన్న పట్టుదల, క్రమశిక్షణ, పార్టీ పట్ల నిబద్ధత ఆయనను ప్రత్యేక నాయకుడిగా నిలబెట్టాయి.

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాజకీయప్రస్థానంలో.
@@@@@@@@@@@@@@@@@@@@@@@
👉 పుట్టిన తేదీ & వయస్సు: ఏప్రిల్ 1,1968 (58 )
👉 స్వగ్రామం. పెద్దపల్లి..
👉 విద్యార్హతలు : ఇంటర్మీడియట్ , ఐటిఐ (MM)
👉 సామాజిక వర్గం. దళిత ( మాదిగ )
👉 1982-1985 గోదావరిఖని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి సంఘ (NSUI) సంఘ అధ్యక్షుడిగా.
👉 1986-1994 కరీంనగర్ జిల్లా ( NSUI ) ప్రధాన కార్యదర్శిగా
👉 1994-1996 NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా.
👉 1996-2001 ఉమ్మడి రాష్ట్ర & కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గా.
👉 2006 ధర్మారం మండల జడ్పీటీసీ సభ్యుడి గా పోటి మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి మాతంగి నరసయ్య పై 3వేల ఓట్ల తో గెలుపు.
👉 2009. నూతనంగా పునర్విభజనలోఏర్పడిన ధర్మపురి అసెంబ్లీ ( ఎస్సీ రిజర్వుడ్) అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా పోటీ. తెరాస అభ్యర్థి చేతిలో స్వల్ప ఓట్లతో 1,365 ఓట్ల తో ఓటమీ.
👉 2010-2012 ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గా పదవి.
👉 2013-2014 ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి.
👉 2013-2014 ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా.
👉 2014 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ధర్మపురి అసెంబ్లీ నుండి ఎమ్మెల్యేగా పోటీ. తెరాస అభ్యర్థి చేతిలో ఓటమి.
👉 2018 అసెంబ్లీ ఎన్నికల లో ధర్మపురి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా పోటీ తెరాస అభ్యర్థి చేతిలో స్వల్ప 441 ఓట్లు తో ఓడినట్టు. ఎన్నికల అధికారి ప్రకటన.( ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు తీరుపై లక్ష్మణ్ కుమార్ హైకోర్టు కు వెళ్లడం. విచారణ తీరు కలకలం సృష్టిచింది.)
👉 2019 లో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గా.
👉 2023 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో. ధర్మపురి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ. నాటి సిట్టింగ్ క్యాబినెట్ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై 22 వేల ఓట్ల మెజారిటీతో విజయం.

👉 2024 ,మార్చి లో ప్రభుత్వ విప్ గా నియామకం.
👉 2024. SC వర్గీకరణ అంశంపై సుప్రీమ్ కోర్టులో వాదిస్తున్న సీనియర్ న్యాయవాదుల తో దళిత ఎమ్మెల్యేల మంత్రుల చర్చల కమిటీ సభ్యుడి గా ప్రభుత్వం నియామకం.
👉 2025 జూన్ 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మలి దశ మంత్రి వర్గ విస్తరణ లో ముగ్గురి మంత్రులలో లక్ష్మణ్ కుమార్ ఒక్కరు.
👉 2026 : 2027 లో జరగనున్న గోదావరి నది పుష్కరల నిర్వహణ మంత్రి వర్గ కమిటీ సభ్యుడు గా
