ఏ ఐ కారణంగా వైట్ కాలర్ జాబ్‌లు పోవు!

👉 ది హిందూ హడిల్ కాంక్లేవ్ లో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !


J SURENDER KUMAR,


మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యువత ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలి. ఆయా రంగాల్లో స్కిల్స్ పెంచుకుంటే అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఏఐ కారణంగా వైట్ కాలర్ జాబ్‌లు పోతున్నాయని అందరూ ఆందోళన చెందుతున్నారు. వైట్ కాలర్ జాబ్‌ల‌కు ప్రత్యామ్నాయం బ్లూ కాలర్ జాబ్స్. యువతరం వాటిపై దృష్టి సారించాలి. అందుకు అవసరమైన స్కిల్స్ పెంచుకోవాలి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చెప్పారు.

👉 ది హిందూ దినపత్రిక బెంగుళూరులో నిర్వహించిన ది హిందూ హడిల్ కాంక్లేవ్ లో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  పాల్గొన్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి ప్రణాళికలను వివరించారు. గోష్టిలో ది హిందూ డైరెక్టర్ ఎన్. రామ్  అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

👉 ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయని ఆందోళనకర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా యువతలో నైపుణ్యం పెంచడానికి తెలంగాణలో అనేక చర్యలు తీసుకున్నట్టు వివరించారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, పాత పాత సిలబస్‌తో మూస పద్ధతిలో కొనసాగుతున్న ఐటీఐలను అత్యాధునిక టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ)లుగా అప్ గ్రేడ్ చేసిన విషయాలను చెప్పారు.

👉 తెలంగాణ సమగ్రాభివృద్ధికి రూపొందించిన తెలంగాణ రైజింగ్-2047 దార్శనికత, 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా రాష్ట్రం ఎదగడానికి నిర్దేశించుకున్న భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. ప్రధానంగా రైతులు, యువత, మహిళల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర భవిష్యత్తు రోడ్ మ్యాప్‌పై చర్చాగోష్టిలో సమగ్రంగా తెలిపారు.