👉 సీఎం రేవంత్ రెడ్డికి ఏజెన్సీ ప్రాంత ఎమ్మెల్యేల విజ్ఞప్తి !
J SURENDER KUMAR,
ఏజెన్సీ ప్రాంతంలోని శాసనసభ నియోజకవర్గాల్లో అదనంగా 2 వేల ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని ఆదివాసీ, గిరిజన ప్రాంత శాసనసభ్యులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కోరారు.
👉 పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క నేతృత్వంలో ఆదివాసీ, గిరిజన శాసనసభ్యుల బృందం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ని కలిసి ఆ మేరకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు.
👉 ఆదివాసీ ప్రాంతాల్లో పోడు భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు ఇందిర గిరి జల వికాసం పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఐటీడీఏలను మరింత బలోపేతం చేయడంతో పాటు గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఇంటర్ వరకు అప్ గ్రేడ్ చేయాలని కోరారు.
👉 ముఖ్యమంత్రి ని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ (అశ్వరావుపేట) , పాయం వెంకటేశ్వర్లు (పినపాక) , కోరం కనకయ్య (ఇల్లందు) తెల్లం వెంకట్రావు (భద్రాచలం) , వెడ్మ బొజ్జు (ఖానాపూర్) ఉన్నారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , మహమ్మద్ అజారుద్దీన్ కూడా ఉన్నారు.
