మంత్రి లక్ష్మణ్ కుమార్‌ లక్ష్యంగా విమర్శలా?

👉 వరుస విమర్శల వెనుక రాజకీయ కోణం ?

👉 మంత్రి  ఆధిపత్యం అడ్డుకోవడానికి కుట్ర ?

J.SURENDER KUMAR,

దశాబ్దన్నర కాలంగా  రాజకీయ ప్రజాక్షేత్రంలో వరుసగా ఓటములు చెందుతూ, పడి లేచిన కెరటం సునామీలా 2023 లో జగిత్యాల జిల్లాలో ఏకైక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన  ప్రభుత్వ విప్, గా , క్యాబినెట్ మంత్రిగా కొనసాగుతున్న మంత్రి లక్ష్మణ్ కుమార్  లక్ష్యంగా ఆయన రాజకీయ ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి బి ఆర్ఎస్ పక్క ప్రణాళిక తో విమర్శలకు శ్రీకారం చుట్టినట్టు చర్చ.

చిరకాల రాజకీయ ప్రత్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఇటీవల టిఆర్ఎస్ పార్టీలో చేరి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి, గురుకుల విద్యా సంస్థల మాజీ కార్యదర్శి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ( మాజీ ఐపీఎస్ అధికారి) మాజీ మంత్రి హరీష్ రావు, పదే పదే   ఎస్సీ ఎస్టీ గురుకుల విద్యార్థుల అవసరాల కోసం  కొనుగోలు టెండర్లలో అవినీతి జరిగింది అంటూ  మంత్రి లక్ష్మణ్ కుమార్  పై చేస్తున్న  ఆరోపణలే  ఇందుకు నిదర్శనం అనే చర్చ మొదలైంది.  ఈ  ఆరోపణల జడి వానలో మంత్రి అడ్లూరి,  కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి లా  రాజకీయ పోరాటం చేస్తున్నారు అనే చర్చ మొదలైంది.

👉 వివరాల్లోకి వెళ్తే…

సంక్షేమ శాఖలో ₹ 2 వేల కోట్ల అవినీతి జరిగిందని మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆరోపణలు చేస్తున్నారు.

ఆ శాఖ మంత్రిగా లక్ష్మణ్ కుమార్ , విద్యార్ధులకు కావాల్సిన వస్తువుల కొనుగోలుకు ₹ 683 కోట్లతో టెండ్లర్లు పిలిచామని, ₹ 500 కోట్లతో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్ల ఖారారు చేశామని . మొత్తం ₹ 1183 కోట్లకు టెండర్లు పిలిస్తే  ₹ 2 వేల కోట్ల అవినీతి ఎలా జరిగిందో ? నిరూపించండి  అని  మంత్రిగా లక్ష్మణ్ కుమార్, అనేకసార్లు సవాలు చేస్తూ డిమాండ్ చేశారు..

  మీ ప్రమేయం లేకుండా  సీఎం పర్యవేక్షణలో జరిగిన టెండర్లలో జరిగిన అవినీతిపై బహిరంగ చర్చకు రావాలి అంటూ మరో వాదన కు శ్రీకారం చుట్టారు.

రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తు, సీఎంకు సన్నిహితుడుగా గుర్తింపు కలిగి ఉన్న  దళిత నాయకుడు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌, లక్ష్యంగా  బిఆర్ఎస్ నాయకులు వరుస ఆరోపణలు చేయడం వెనుక రాజకీయ కోణం ఉంది అనే చర్చ సాగుతోంది.

జిల్లాలో  దాదాపు 70 శాతం కాంగ్రెస్ సర్పంచులు గెలవడం, జగిత్యాల, కోరుట్ల, మెట్టుపల్లి,  మున్సిపాలిటీ ల తో  పాటు మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి మున్సిపాలిటీలో మొత్తం కౌన్సిలర్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడంతో  జిల్లాలో  టిఆర్ఎస్  ఉనికి ప్రశ్నార్థకంగా మారనున్నదని  మంత్రిని టార్గెట్ చేస్తూ, సమయం, సందర్భం లేకుండా ఆరోపణలు చేస్తున్నారు అనేది చర్చ.

👉 ఆ నాయకులు మౌనం వెనుక ?

ఇది ఇలా ఉండగా జిల్లాలో బిఆర్ఎస్ కీలక నాయకులు, ఆ పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్,  జిల్లా పరిషత్  మాజీ చైర్ పర్సన్ దావ వసంత, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవి శంకర్, ఆ పార్టీ ప్రస్తుత కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ , కరీంనగర్ మాజీ ఎంపీ  వినోద్ కుమార్ మాజీ మంత్రి రాజేశం గౌడ్, ఆ పార్టీ కి చెందిన తదితర సీనియర్ నాయకులు ఈ అంశంలో ఎలాంటి ఆరోపణలు చేయడం లేదు..

దీంతో కేవలం  మంత్రి లక్ష్మణ్ కుమార్, రాజకీయ ఆదిపత్యాన్ని అడ్డుకోవడం కోసమే మాజీ మంత్రు లు హరీష్ రావు,  కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లు చేస్తున్న అసత్య ఆరోపణలకు నిదర్శనం అనే చర్చ మొదలైంది..

👉 నిరసనలు ఎక్కడ ?

మంత్రి వివరణ ఇచ్చినప్పటికీ, ఈ వ్యవహారంపై చేస్తున్న ఆరోపణలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు లేదా, నిరసనలు కనిపించకపోవడం, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిజంగా భారీ అవినీతి జరిగి ఉంటే, ఆ పార్టీ ఈ అంశాన్ని రాష్ట్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు మరింత విస్తృతంగా జరిగేవి కాదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

👉 మీడియాలో .. ?

మరోవైపు, ఈ ఆరోపణలకు సంబంధించిన అంశాలు ప్రతిపక్షానికి అనుకూలంగా భావించే కొన్ని మీడియా సంస్థల్లో కూడా పెద్దగా ప్రాధాన్యం పొందకపోవడంపై రాజకీయ విశ్లేషకులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటి? ఆరోపణలకు తగిన ఆధారాలు లేవా? లేక ఇది కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

👉 వర్గీకరణ ?

దీనికి తోడు ఎస్సీ వర్గీకరణ న్యాయపోరాటంలో సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదులతో  చర్చలు జరిపే  మాదిగ ప్రజాప్రతితుల కమిటీలో మంత్రి లక్ష్మణ్ కుమార్  సభ్యుడు కావడం ( మాదిగ) వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ను చట్టసభల ఆమోదంలో మంత్రి   కీలక పాత్ర వహించడంతో   కొప్పుల ఈశ్వర్ ( మాల) కు లక్ష్మణ్ కుమార్ పై సామాజిక ఆగ్రహానికి మరో కారణమై ఉండవచ్చు అనేది చర్చ.

వేల కోట్ల అవినీతి జరిగింది అంటూ ఆరోపణలు చేస్తున్న ఆ పార్టీ నాయకులు  తమ పార్టీ  రాజకీయ మైలేజ్ కోసం ఈ అంశంలో ఏం చేశారు అనే చర్చ మొదలైంది.