బీర్ పూర్ గుట్ట కింద గుప్పుమంటున్న దుర్వాసన!

J.SURENDER KUMAR,

పచ్చని అడవులు  ఎత్తైన  కొండల్లో కొలువై ఉన్న బీర్పూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర గుట్ట కింద దుర్వాసన, అపరిశుభ్రమైన వాతావరణంతో భక్తజనం అవస్థలు పడుతున్నారు..

జగిత్యాల జిల్లా మండల కేంద్రమైన బీర్పూర్ సమీప అడవుల్లో ఎత్తైన కొండలలో వందలాది సంవత్సరాల క్రితం నుంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది.. స్వామివారిని దర్శించుకోవడానికి  జగిత్యాల, మంచిర్యాల, నిర్మల్  జిల్లాల  గ్రామాల నుండి ,ప్రత్యేక పర్వదినాలలో మొక్కలు, ముడుపులు చెల్లించుకోవడానికి కాలినడకన ఎడ్లబండ్లలో, భక్తులు వస్తుంటారు

.

భక్తజనం గుట్ట కింద వంటలు చేసుకోవడం అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయం..పెళ్లిళ్లు, శుభ కార్యం నేపథ్యంలో వండుకొని బంధు వర్గంతో కలిసి భోజనాలు చేస్తుంటారు.  భోజనాలు వంటల ఏర్పాటు కు భక్తులు వేలాది రూపాయల రుసుము చెల్లించుకోవాల్సి ఉంటుంది ( ఇందుకు నిర్వాహకులు ర సీదు సైతం ఇస్తారు..) ఈ సొమ్ము స్థానిక పంచాయతీ ఖాతాలో, లేదా ఆలయానికి చెందుతుందో అనే అంశంలో స్పష్టత లేదు..

వంటలు వండుకోవడానికి కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత నిర్వాహకులు విస్మరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  వర్షం, గాలి దుమారం వీచిన సందర్భంలో  వంట గదులలో భక్తులు వండుకోలేకపోతున్నారు, కొన్ని సందర్భాల్లో వండుకున్న వంటకాలు తడుస్తున్నాయి అని భక్తులు ఆవేదన చెందుతున్నారు..

ఇది ఇలా ఉండగా గత కొన్ని రోజుల క్రితం శునకం ఈ ప్రాంతంలో ( స్వామివారి రథశాల సమీపంలో ) మృతి చెంది దుర్వాసన వెదజల్లుతున్న మృతి చెందిన శునకం తొలగించకుండా నిర్వాహకులు అలానే వదిలిపెట్టారు..

దీంతో భక్తజనం దుర్వాసన కు సుదూర ప్రాంతాల్లో వండుకొని భోంచేయడానికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి వసతి, వంట గదుల మరమ్మతు,  ఈ ప్రాంతంలో తాగునీటి సౌకర్యం కల్పించి, పారిశుద్ధ్యం పనుల పట్ల  ప్రజా ప్రతినిధులు, ఆలయ అధికారులు జోక్యం చేసుకొని  ఇబ్బందులను తొలగించాల్సిందిగా  భక్తులు వేడుకుంటున్నారు..