👉 ₹ 68 కోట్ల నిధులతో నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి !
👉 మద్దులపల్లి, ఏడు మోటాలపల్లి, రాజారాం తండాల్లో సీత్ల పండుగ వేడుకలు !
👉 వేడుకల్లో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గంలోని ప్రతి గిరిజన తండా, గూడెంకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పన లక్ష్యంగా మా ప్రభుత్వం లక్ష్యంగా ₹ 68 కోట్ల నిధులతో రోడ్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

బంజారాల సీత్ల పండుగ వేడుకల్లో భాగంగా మంగళవారం పెగడపల్లి మండలం మద్దులపల్లి, ఏడు మోటాలపల్లి, రాజారాం తండాల్లో జరిగిన సీత్ల పండుగ వేడుకల్లో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ…

ధర్మపురి నియోజకవర్గంలోని ప్రతి తండలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. పెగడపల్లి మండలంలోని పలు తండాలను కలుపుతూ కోట్లాది రూపాయల నిధులతో రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు మంత్రి వివరించారు.
మద్దులపల్లి గ్రామంలో గిరిజన భవన నిర్మాణానికి ₹ 25 లక్షలు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. మద్దులపల్లిలో గిరిజన భవన నిర్మాణానికి రెండు ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించాలని మంత్రి ఆదేశించారు.
👉 ధర్మారం మండలం బంజరు పల్లి లంబాడి తండా, కమ్మర్ ఖాన్ పేట తండా తండాల్లో జరిగిన సీత్ల పండుగ వేడుకల్లో మంత్రి లక్ష్మణ్ కుమార్ !
ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బంజరు పల్లి లంబాడి తండా, కమ్మర్ ఖాన్ పేట తండా తండాల్లో జరిగిన సీత్ల పండుగ వేడుకల్లో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

ధర్మపురి నియోజకవర్గంలోని తండాలను ప్రధాన రోడ్లను కలుపుతూ ₹ 68 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు మంత్రి వివరించారు. నియోజకవర్గంలోని తండాల్లో మౌలిక సదుపాయాలు కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి వివరించారు.

లంబాడి తండా గిరిజన భవన నిర్మాణానికి ₹ 25 లక్షలు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. లంబాడి తండాలో సేవాలాల్ మహారాజ్ దుర్గామాత ఆలయాల కు సంబంధించిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
