👉 నీట్ టాపర్లు, ఆసియా స్వర్ణ పతక విజేత ప్రవల్లికతో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి అడ్లూరి !
👉 పేదింటి పిల్లల విజయాలే ప్రభుత్వానికి నిజమైన పురస్కారం!
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
పేదరికం ప్రతిభకు ఎప్పుడూ అడ్డంకి కాదని, ప్రభుత్వం కల్పించే అవకాశాలు, నాణ్యమైన విద్య, ఉపాధ్యాయుల అంకితభావం కలిస్తే గురుకుల విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అద్భుత విజయాలు సాధించగలరని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 శనివారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో చదివి నీట్‌లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులతో పాటు, చైనాలోని ఓర్డోస్‌లో నిర్వహించిన తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్–2026లో మహిళల 4×400 మీటర్ల రిలేలో భారత జట్టుకు స్వర్ణ పతకం అందించిన సాయి ప్రవల్లికతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు.
👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…..
గురుకులాల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి విజయం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టి, ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలు, ఉపాధ్యాయుల నిబద్ధత, తల్లిదండ్రుల విశ్వాసం ఉన్నాయి. ఈ విజయాలు ఒక్క కుటుంబాలకే కాదు, తెలంగాణ సమాజానికే గర్వకారణం అని అన్నారు.

👉 గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, ఆధునిక వసతి, డిజిటల్ విద్య, నీట్, జేఈఈ, సివిల్స్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత ప్రత్యేక శిక్షణ, అనుభవజ్ఞులైన అధ్యాపకుల మార్గదర్శకత్వం అందిస్తున్నట్లు మంత్రి వివరించారు.
👉 ఈ సమగ్ర విద్యా విధానం వల్లే పేద కుటుంబాల విద్యార్థులు దేశ అత్యున్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు సాధిస్తున్నారని చెప్పారు.సామాజిక న్యాయం అంటే కేవలం సంక్షేమ పథకాల అమలు మాత్రమే కాదు… పేద పిల్లలను అత్యున్నత విద్య, ఉద్యోగ అవకాశాలతో నాయకత్వ స్థానాలకు తీసుకెళ్లడం కూడా సామాజిక న్యాయమే. అదే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది” అని మంత్రి స్పష్టం చేశారు.

👉 ఆసియా స్థాయిలో స్వర్ణ పతకం సాధించిన సాయి ప్రవల్లికను ప్రత్యేకంగా అభినందించిన మంత్రి, “విద్యతో పాటు క్రీడల్లోనూ గురుకుల విద్యార్థులు ప్రపంచస్థాయిలో రాణించడం తెలంగాణ గురుకుల విద్యా వ్యవస్థ సామర్థ్యానికి నిదర్శనం. రాబోయే రోజుల్లో మరింత మంది ఒలింపియన్లు, వైద్యులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, సివిల్ సర్వెంట్లు గురుకులాల నుంచే రావాలి” అని ఆకాంక్షించారు
👉 నీట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ, “మీ విజయం మీ కుటుంబానికే కాదు… మీ తర్వాత వచ్చే వేలాది మంది పేద విద్యార్థులకు స్ఫూర్తి. కష్టపడి చదివితే ప్రభుత్వ గురుకులాల నుంచే దేశ అత్యున్నత స్థానాలకు చేరుకోవచ్చని మీరు నిరూపించారు. మీ విజయ ప్రస్థానంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది” అని మంత్రి హామీ ఇచ్చారు.
👉 “తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతోంది. ప్రతి పేద విద్యార్థి కలను ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నాం. ప్రతి గురుకుల విద్యార్థి విజయం ప్రభుత్వ విజయంగానే భావించి, వారికి అవసరమైన ప్రతి అవకాశాన్ని కల్పిస్తాం” అని మంత్రి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.
👉 విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ……

తమ పిల్లలకు కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, ఉచిత ప్రత్యేక కోచింగ్, అత్యాధునిక సౌకర్యాలు కల్పించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి విజయేంద్ర బోయి, TGSWREIS కార్యదర్శి (FAC) కంభంపాటి శారద, జాయింట్ సెక్రటరీ (అకాడమిక్) సక్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
