👉 ప్రజల ముందు పెట్టడానికి మీ చిట్టా మా చేతిలో ఉన్నాయి !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
2014 నుంచి 23 డిసెంబర్ వరకు మేమే రాజులం, మేమే మంత్రులం, ముచ్చటగా మూడోసారి కూడా, మా ప్రభుత్వమే వస్తాది’ అని చెప్పి విర్రవీగి మాట్లాడిన మాజీ మంత్రి కేటీఆర్, ‘యువ గర్జన’ అని చెప్పేసి సరూర్‌నగర్‌లో పెయిడ్ వర్కర్లతోని మీటింగ్ ఏర్పాటు చేసుకొని, ముఖ్యమంత్రిపై నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావ్ఖ బడ్దార్ బిడ్డ అంటూ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన యువజన సభపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
👉 కేటీఆర్ సభకు వచ్చింది అసలైన కార్యకర్తలు కాదని, డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న పెయిడ్ వర్కర్లు అని మంత్రి ఆరోపించారు. రాబోయే 2029 ఎన్నికలలో మేము ఏ విధంగా అధికారంలోకి రావాలనే ఒక దురుద్దేశంతో కేటీఆర్ మా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
👉 కేటీఆర్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, జనాలను తరలించడానికి బీఆర్ఎస్ నేతలు అష్టకష్టాలు పడ్డారని మంత్రి అడ్లూరి ఆరోపించారు.
👉 నిరుద్యోగుల మోసం:
తెలంగాణ ఉద్యమ సమయంలో యువతను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన కేటీఆర్.. ఆ తర్వాత నిరుద్యోగులను పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. కేటీఆర్ హయాంలో పేపర్ లీకేజీలు, పరీక్షల వాల్యుయేషన్లలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు
.
👉 ప్రభుత్వ ఉద్యోగాల రికార్డు:
“కొలువుల కుంభమేళా ఎక్కడ?” అని ప్రశ్నిస్తున్న కేటీఆర్.. ముందుగా ప్రభుత్వ రికార్డులను పరిశీలించాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది కాలంలోనే దాదాపు 67,763 ఉద్యోగ పత్రాలను అందించామని, మరో 13,197 ఉద్యోగాల ప్రక్రియ తుది దశలో ఉందని స్పష్టం చేశారు.
👉 సవాల్:
కేటీఆర్ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకూడదని, ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు.
👉 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర వహించిన ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టకుండా నీవు కానీ, నీ తండ్రి గానీ, ఆ విద్యార్థుల యొక్క కష్టాలు తెలుసుకోకుండా ఉస్మానియా యూనివర్సిటీలోకి ఏ నాయకుడు వెళ్లలేదని విద్యార్థుల సమస్యలు వాళ్ళ కష్టాలు వినకుండా, మీరు నిరంకుశత్వంతో పరిపాలన చేశారని మంత్రి ఆరోపించారు. త్వరలో మీ పాలన చిట్టాను ప్రజల ముందు పెడతామంటూ మంత్రుల లక్ష్మణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
