J.SURENDER KUMAR,
సోమవారం మృతిచెందిన సువర్ణ వనమాల ( మంథని మాజీ సర్పంచ్ స్వర్గీయ సువర్ణ చంటయ్య సతీమణి )
కుటుంబ సభ్యులను శుక్రవారం రాత్రి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ , దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
పరామర్శించారు.

మృతి చెందిన సువర్ణ వనమాల (91), ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ సభాపతి, స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు సోదరి, మంత్రి శ్రీధర్ బాబు మేనత్త, వనమాల, జ్ఞాపకాలను, మంచితనాన్ని మంత్రి గుర్తు చేసుకొని వారి ఆత్మకు శాంతి కలగాలని కోరారు.

మంత్రి వెంట న్యాయవాది కాంగ్రెస్ నాయకుడు శశి భూషణ్ కాచే , ప్రజా ప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు
