J.SURENDER KUMAR,
ధర్మపురి పట్టణ ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వీరవేణి కొమురయ్య ను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అభినందించారు.
ధర్మపురిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం మంత్రి లక్ష్మణ్ కుమార్‌ను ముదిరాజ్ సంఘ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈసందర్భంగా మంత్రి కొమురయ్యను శాలువాతో సన్మానించి, నూతన బాధ్యతలు విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ముదిరాజ్ సంఘం అభివృద్ధికి కృషి చేస్తూ సభ్యుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని మంత్రి సూచించారు.
ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
