👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందస్తు ప్రణాళికతో పుష్కర పనులకు శ్రీకారం చుట్టడంతో. పుష్కరాలకు ముందే గోదావరి నది తీరంలోని ఆలయాలకు ప్రత్యేక శోభ రావడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామంలోని శ్రీ కోటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…..

దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి పుష్కరాలకు ఏడాది ముందుగానే ఏర్పాట్లు చేయడానికి బడ్జెట్ లో నిధులు కేటాయించారని మంత్రి అన్నారు.
👉 గోదావరి తీరం వెంట పుణ్యక్షేత్రం బాసర నుంచి భద్రాచల క్షేత్రం వరకు ఉన్న ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించినట్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర అభివృద్ధికి నిధులు కేటాయించడంతో పాటు కోటిలింగాలలోని కోటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ₹10 కోట్లు కేటాయించినట్లు మంత్రి వివరించారు.

👉 ధర్మపురి నియోజకవర్గానికి పుష్కర పనుల కోసం ₹ 117 కోట్లు కేటాయించగా ఇందులో కోటిలింగాలలో పుష్కర ఘాట్ నిర్మాణానికి రూపాయలు ₹ 8 కోట్లు కోటిలింగాల నుండి పాశీగాం వరకు రోడ్డు నిర్మాణానికి ₹ 8 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.
👉 ధర్మపురి శ్రీ ఉగ్ర నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి ₹ 10 కోట్లు కేటాయించగా వెల్గటూర్ నుండి కోటిలింగాల వరకు నాలుగు లైన్ల రహదారి విస్తరణ కొరకు ₹20 కోట్లు కేటాయించినట్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

👉 కోటిలింగాల తోపాటు రాజక్కపల్లి వద్ద మిని ట్యాంక్ బండ్ మాదిరిగా నిర్మాణం చేస్తామని మంత్రి తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి కుమార్ తెలిపారు.
👉 సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత !

కోటిలింగాల గ్రామానికి చెందిన మంచి కట్ల మణితేజ ఇటీవల కుక్క కాటుకు గురై మరణించగా ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ప్రభుత్వం మంజూరు చేసిన ₹ 5లక్షల చెక్కును మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఈ సందర్భంగా మణితేజ కుటుంబ సభ్యులకు అందించారు..
👉 గృహప్రవేశంలో…..

వెల్గటూర్ మండల కేంద్రంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు సింగం రాజేశ్వరి – తిరుపతి ఇంటి గృహప్రవేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
