J .SURENDER KUMAR,
ధర్మపురి పట్టణంలోని వివిధ కారణాలతో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం పరామర్శించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
👉 ఆర్థిక సహాయం !

పట్టణానికి చెందిన సీనియర్ బిజెపి నాయకుడు పోగుల గుండయ్య మృతి చెందగా, నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. ఈ సందర్భంగా పోగుల గుండయ్య కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయంగా ₹10 వేల నగదును మృతుడి కుటుంబ సభ్యులకు మంత్రి అందించారు.
👉 సీఎం సహాయ నిధి అందిస్తా !

ఇందిరమ్మ కాలనీలో గత కొన్ని రోజుల క్రితం కోతుల దాడులలో ప్రమాదవశాత్తు తలపై రాయి పడి మృతి చెందిన కోనపర్తి పద్మ కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో సీఎం ఓ కార్యదర్శి కి మంత్రి ఫోన్ చేసి జరిగిన సంఘటన వివరించి సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందించాల్సిందిగా కోరారు.
👉 బిజెపి నాయకుడు కుటుంబాన్ని !

సీనియర్ బిజెపి నాయకుడు ఆకుల శ్రీనివాస్ ఆరోగ్యంతో ఇటీవల మృతి చెందారు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి మంత్రి ఓదార్చారు.
👉 రిటైర్డ్ ఉద్యోగ సంఘ నాయకుడినీ !

రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకుడు సంగీ రాజన్న సతీమణి ఇటీవల అనారోగ్యంతో మృతి మృతి చెందింది. మంత్రి కుటుంబ సభ్యుల పరామర్శించి అనారోగ్య వివరాలను తెలుసుకొని ఓదార్చారు.
👉 ఉపాధ్యాయ సంఘం నాయకుడిని!

పట్టణంలోని తోట్ల వాడవు చెందిన ఉపాధ్యాయ నాయకుడు బక్క శెట్టి మల్లేశం తల్లి ఇటీవల మృతి చెందారు మల్లేశం కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు.
👉 కాంగ్రెస్ నాయకుడి కుటుంబాన్ని!
ఇటీవల అనారోగ్య బారిన పడి హైదరాబాద్ లో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స మృతి చెందిన మెకానిక్ ( మ్యాదరి ) గోపాల్ కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. గోపాల్ చికిత్స కోసం మంత్రి ₹ 2 లక్షలు ఎల్ వో సి ఇచ్చారు. మంత్రి వెంట కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
