👉 లండన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
తెలంగాణ అభివృద్ధిలో ప్రవాసులు భాగస్వాములు కావాలని, తెలంగాణ రైజింగ్‌కు బలమైన మద్దతుదారులు, బ్రాండ్ అంబాసిడర్లుగా మారి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్దేశించుకున్న తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని లండన్‌లోని తెలుగు ప్రవాసులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి , ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదివారం లండన్‌లో తెలుగు ప్రవాసులతో సమావేశమయ్యారు. ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, భవిష్యత్ ప్రగతిపై వారితో విస్తృతంగా చర్చించారు.
