👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ !
J.SURENDER KUMAR,
సహచర మంత్రి, సోదరి కొండా సురేఖ తన మంత్రి పదవికి తక్షణం రాజీనామా చేసి, సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కేంద్రంలో శనివారం ఐటి డి ఎ ( ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ) కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశానికి, అభివృద్ధి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు.
కార్యక్రమం అనంతరం పాత్రికేయులు మంత్రి కొండా సురేఖ కూతురు, సుస్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డి పై చేసిన కామెంట్ పై మంత్రి లక్ష్మణ్ కుమార్ ను స్పందన కోరారు. స్థానిక ఎమ్మెల్యే వెడ్మబొజ్జు, ఎమ్మెల్సీ విఠల్తో కలిసి మంత్రి లక్ష్మణ్ కుమార్ పాతికేయలతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై సుస్మిత చేసిన అనుచిత వ్యాఖ్యలకు పూర్తి బాధ్యత వహిస్తూ ఆమె తల్లి, మంత్రి కొండా సురేఖ రాజీ నామా చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ రాష్ట్రంలో పది సంవత్సరాలు అధికారంలోకి రాలేదని, అధికారంలోకి తేవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎనలేని కృషి చేశారని మంత్రి అన్నారు. సోదరి మంత్రి కొండా సురేఖ ఇప్పటికైనా తప్పును తెలుసుకొని సీఎం రేవంత్ రెడ్డికి, ప్రజలకు, క్షమాపణ చెప్పి తన మంత్రి పదవికి రాజీనామా చేసి మంత్రి వర్గం నుంచి తప్పుకొంటే బాగుంటుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆయన అభిప్రాయపడ్డారు.
తన కుమార్తె వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని మంత్రి సురేఖ చెప్పడం ఆమోదయోగ్యం కాదని, పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని మంత్రి మరో సారీ డిమాండ్ చేశారు.
