ధర్మపురి ఆర్యవైశ్య సంఘ ఎన్నికలు ఏకగ్రీవం !


👉 పట్టణ అధ్యక్షుడిగా పిన్న శ్రీనివాస్ !


👉 మండల అధ్యక్షుడిగా సాయిని శ్రీనివాస్ !


J.SURENDER KUMAR,


ప్రముఖ పుణ్యక్షేత్రం,నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి, పట్టణ, మండల, ఆర్యవైశ్య సంఘ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. పట్టణ అధ్యక్షుడిగా పిన్న శ్రీనివాస్, మండల అధ్యక్షుడిగా సాయిని శ్రీనివాస్ ఎన్నికయ్యారు.

పట్టణ అధ్యక్షుడు పి శ్రీనివాస్ ( ఫైల్ ఫోటో)


ఆదివారం జరిగిన  నామినేషన్ కార్యక్రమంలో మండల అధ్యక్ష పదవికి సాయిని శ్రీనివాస్, పట్టణ అధ్యక్ష పదవికి పిన్న శ్రీనివాస్  రెండు పదవులకు సింగిల్ నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఎన్నికల అధికారులు వారిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.

మండల అధ్యక్షుడు ఎస్ శ్రీనివాస్ ( ఫైల్ ఫోటో)


ఈ ఎన్నికల నిర్వహణ కన్వీనర్‌గా సాయిని సత్యనారాయణ, ఎన్నికల అధికారులుగా రంగ శ్రీనివాస్, అక్కనపెల్లి శ్రీనివాస్, దొంతుల శ్రీధర్, సాదు శ్రీకాంత్ వ్యవహరించారు.