ఆడపడుచులకు అన్నగా అండగా ఉంటా !

👉మహిళల సంక్షేమం, ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యం !

👉రాఖీలు కట్టిన ఆడపడుచులకు సారెతో ఆత్మీయత చాటిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


ఆడపడుచులకు అన్నగా అండగా ఉంటానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భరోసా ఇచ్చారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలను ధర్మపురిలో మంత్రి వినూత్న ఆత్మీయతతో నిర్వహించారు.

రాఖీ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ధర్మపురిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో స్థానిక మహిళా కౌన్సిలర్లు, కౌన్సిలర్ల సతీమణులు, మహిళా ఉద్యోగులు, మహిళా సంఘాల సభ్యులు, నియోజకవర్గంలోని ఆడపడుచులు మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.


ఈ సందర్భంగా మంత్రి ప్రతి సోదరీమణికి సంప్రదాయ హిందూ పద్ధతిలో సారె (చీర) కానుకగా అందించి, వారిపై తనకున్న ఆత్మీయతను చాటుకున్నారు.  ఆడపడుచులకు సోదరుడిగా ఎల్లప్పుడూ అండగా ఉంటానని, వారి సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

👉 మహిళల ఆర్థిక సాధికారతకు పెద్దపీట !

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం, ఆర్థిక స్వావలంబన కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి అన్నారు.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో చేపడుతున్న కార్యక్రమాలు, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం తదితర సంక్షేమ పథకాలు మహిళల జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా కొనసాగుతున్నాయని వివరించారు.

“సోదరీమణుల ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలు నాకు ఎల్లప్పుడూ కొండంత అండగా ఉంటాయి. రక్షాబంధన్ పర్వదినం ప్రతి కుటుంబంలో ఆనందాన్ని నింపాలి. ఆడపడుచుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుంది” అని మంత్రి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. రాఖీ కట్టిన ఆడపడుచులకు మంత్రి స్వయంగా సారె  అందించడంతో  మంత్రి సోదరుడి ఆత్మీయతను అందుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిలిచింది.