👉 అనంతగిరి పోచమ్మ మాతను దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
ప్రముఖ పవిత్ర క్షేత్రంగా మహిమగల మాతగా ప్రసిద్ధిగాంచిన
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అంతగిరి (అనంతగిరి) లోని పోచమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి నిధులు విడుదలకు కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా శుక్రవారం మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆలయానికి చేరుకోగానే అర్చకులు వేద పండితులు మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభంతో స్వాగతం స్వాగతం పలికారు పోచమ్మ మాతను దర్శించుకున్న మంత్రికి అర్చకులు తీర్థప్రసాదాలు అందించి శేష వస్త్రం బహుకరించారు .
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….

రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులు, కార్మికులు, పేదలు, బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో సంతోషం వెల్లివిరియాలని అమ్మవారిని వేడుకున్నట్టు మంత్రి తెలిపారు.
