J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్ మండలం సంకెనపెల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధులతో సుమారు ₹ 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…

గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గ్రామపంచాయతీ భవనాలు ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, గ్రామ పాలనను సమర్థవంతంగా నిర్వహించేందుకు దోహదపడతాయని అన్నారు.

👉MGNREGS నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాల్లో అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు.

👉 సంకెనపెల్లి గ్రామ అభివృద్ధికి అవసరమైన పనులను దశలవారీగా చేపట్టి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
