ఆలయాలు దర్శించుకున్న కమిషనర్ హనుమంతరావు !

J.SURENDER KUMAR,

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని, కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని, సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ధర్మపురి ఆలయ ప్రాంగణంలో శనివారం మంత్రి లక్ష్మణ్ కుమార్ పర్యవేక్షణలో. జరిగిన గోదావరి నది పుష్కర పనుల సమీక్ష సమావేశంలో కమిషనర్ పాల్గొన్నారు.


ఈ నేపద్యంలో కమిషనర్ ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ,కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు అర్చకులు వేద పండితులు  సాంప్రదాయబద్ధంగా కమిషనర్ ను స్వాగతించి స్వామివారి  శేష వస్త్రంను తీర్థప్రసాదాలను అందించారు.