అంబేద్కర్ భవన్ లో లైబ్రరీ స్టడీ సర్కిల్ ఏర్పాటు!

👉  అభివృద్ధితో  మారనున్న ధర్మపురి రూపురేఖలు !

👉 కుంభమేళా తరహాలో పుష్కరాలు నిర్వహిస్తాం !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.!

J.SURENDER KUMAR,

త్వరలో నిర్మాణం కానున్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ భవనం లో  లైబ్రరీ, స్టడీ సర్కిల్ ను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు మెటీరియల్ అందుబాటులో ఉండేలా మౌలిక వసతులను కల్పిస్తామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి పట్టణం15 వ వార్డులో  నూతన అంబేద్కర్ భవన నిర్మాణానికి మంత్రి లక్ష్మణ్ కుమార్, భూమి పూజ చేశారు, మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్,  వార్డు కౌన్సిలర్  ఓజ్జల లక్ష్మణ్ , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలుముల లక్ష్మణ్ , ఇతర వార్డు కౌన్సిలర్లు, కో ఆప్షన్  సభ్యులు, ఇంజనీరింగ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

కొన్ని దశాబ్దాల క్రితం నిర్మితమై కూలిపోయిన అంబేద్కర్ సంఘ భవనం పట్టణ ప్రధాన కూడలిలో ఉందని, కింద రెండు అంతస్తుల భవన నిర్మాణంలో కింద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తామని, మంత్రి అన్నారు.


👉 అంబేద్కర్ భవన మెయింటెనెన్స్ కు షాపింగ్ కాంప్లెక్స్ కిరాయి సొమ్ముతోపాటు, స్టడీ మెటీరియల్, ఇంటర్నెట్
సౌకర్యాలు తదితర అవసరాల నిమిత్తం భవిష్యత్తులో యువత ఉపయోగించుకోవచ్చు అని మంత్రి అన్నారు.
భవన  పై అంతస్తు నిర్మాణానికి అదనంగా మరో ₹ 10 లక్షల రూపాయల  పంచనాలతో నివేదిక సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.

👉 మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పట్టణంలోని వివిధ కుల సంఘాల భవనాల నిర్మాణాలకు లక్షలాది రూపాయల నిధులు కేటాయించి ధర్మపురి క్షేత్రం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు.

👉 పుష్కరాలకు ₹ 117 కోట్ల నిధులు !

గోదావరి పుష్కరాలలో భక్తులకు  సౌకర్యార్థం భవిష్యత్తులోనూ ఉపయోగపడే పనులకు  ప్రభుత్వం ₹ 117 కోట్లు కేటాయించగా, ఇందులో ధర్మపురిలో ₹ 37 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.

👉 కుంభమేళా తరహాలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గోదావరి పుష్కర ల నిర్వహణకు దేవాదాయ, రెవెన్యూ, ఇంజనీరింగ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి  ఉన్నతాధికారులతో కొన్నిసార్లు సమీక్ష సమావేశాలు జరిగాయని మంత్రి వివరించారు. వీటితోపాటు టి యు ఎఫ్ ఐ డి సి నిధులు ₹ 15 కోట్లతో పాటు అమృత పథకం ద్వారా నిధులు సాధించి ధర్మపురి లో అభివృద్ధి పనులు కొనసాగిస్తామని మంత్రి వివరించారు.

👉  జర్నలిస్టులకు సైతం…

ధర్మపురి పట్టణం జర్నలిస్టులకు ఇంటి స్థలాల కేటాయింపు అంశం పరిశీలనలో ఉందని వివాద రహిత స్థలంతో పాటు అర్హులైన జర్నలిస్టులకు న్యాయం చేస్తానని మంత్రి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు.