మంథని కోర్టు ప్రాంగణంలో గోరింటాకు సందడి !

J SURENDER KUMAR,

నిత్యం కేసులు, వాదనలు, ప్రతివాదనలు, నేర విచారణ, న్యాయవాదుల మీ లార్డ్ అనే సంబోధన, కేసులు వాయిదా, నిందితుల గైర్హాజరు, వారింట్ ల జారీ బెయిల్ మంజూరు, హాజరు పిలుపులతో సందడిగా ఉండే మంథని కోర్టు ప్రాంగణం బుధవారం గోరింటాకు సంబరాలతో సందడిగా మారింది.

మంథని కోర్టు లో బార్ అసోసియేషన్ మరియు కోర్ట్ సిబంది ఆధ్వర్యంలో ఆషాడ మాసం ముగింపు సందర్భంగా  గోరింటాకు  వేడుకలు జరుపుకున్నారు.

ఈ  వేడుకలలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది, అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి ఆర సుధారాణి, సూప రిండెంట్ రజనీ, న్యాయవాదులు షబానా,మొర స్రవంతి పాల్గొన్నారు.  న్యాయ వాదులు జడ్జిలను గోరింటాకు తో అలంకరించారు, జడ్జి లు, మహిళా న్యాయవాదులు, కోర్ట్ సిబంది పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు