అంగన్వాడీ కేంద్రాలు  అమ్మ ఓడిలాంటివి..!

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


చిన్నపిల్లలకు, గర్భిణీలకు బాలింతలకు అంగన్వాడి కేంద్రాలు అమ్మ ఒడిలాంటివి  అని అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్య, ఆరోగ్య పరిరక్షణ వంటి సేవలు అందుతున్నాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


ధర్మపురి నియోజకవర్గ పెగడపల్లి మండల కేంద్రంలో మంగళవారం  రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా దాదాపు ₹ 12 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు.

అనంతరం మండల ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.

👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్….
మాట్లాడుతూ..

ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ద్వారా చిన్నారులకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

👉 అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని, స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

👉 ప్రజల అవసరాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతూ పెగడపల్లి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.