J SURENDER KUMAR,
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) భవనం అందుబాటులోకి రావడంతో మండల ప్రజలకు వైద్య సేవలు మరింత సులభతరం కానున్నాయని, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి నియోజకవర్గం ధర్మారం మండల కేంద్రంలో మంగళవారం సుమారు ₹ 1.56 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని, మరియు ₹12 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంగన్వాడి భవనాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.
అనంతరం ధర్మారం మార్కెట్ యార్డులో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
👉 పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ధర్మారం మండల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైద్య సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
