👉 ధర్మపురి గల్ఫ్ సేవాసమితి ఆర్థిక సహాయం !
J.SURENDER KUMAR,
ఈ నెల 15 న దుబాయ్ లో మృతి చెందిన ధర్మపురి నివాసి తొట్ల రవి, కుటుంబానికి ధర్మపురి గల్ఫ్ సేవా సమితి సభ్యులు బుధవారం ₹ 1.30 లక్షల ఆర్థిక సహాయం అందించారు.
శ్రీ లక్ష్మీనరసింహ కాలనీలో నివాసముంటున్న రవి కుటుంబ సభ్యులను సేవా సమితి సభ్యులు కలసి ఓదార్చి పరామర్శించారు. పిల్లల చదువులు పెళ్లిళ్లకు, అండగా ఉంటామని మృతుడి భార్య ఐలమ్మకు మనో ధైర్యం కల్పించారు.
గల్ఫ్‌లో ఉపాధి కోసం వెళ్లిన సాధారణ కార్మికుడి రవి జీవితానికి విషాదకరమైన ముగింపు ఎదురైనా. మరణం అనంతరం తీసుకున్న అవయవదాన నిర్ణయం మాత్రం “మనిషి జీవితం ముగిసినా.. మానవత్వం మాత్రం కొనసాగుతుంది” అనే గొప్ప సమాజానికి స్ఫూర్తిని ఇచ్చిన విషయం తెలిసిందే.

సేవా సమితి పక్షాన ₹ 1. లక్ష రూపాయలు రవి కూతురు పేరిట డిపాజిట్ చేసిన బ్యాంకు ధ్రువీకరణ పత్రాన్ని అందించడంతోపాటు దశదిన కర్మలకు ₹ 30 వేలు నగదు అందించారు. వార్డు కౌన్సిలర్ మూడుసుల ప్రశాంత్ ద్వారా రవి కుటుంబ సభ్యులకు ఫిక్స్డ్ పత్రాన్ని అందించారు.
మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో ధర్మపురి గల్ఫ్ సేవా సమితి సభ్యులు, ఆకుల రాయనర్సు,, గట్ల శ్రీనివాస్, రాపర్తి గణేష్, తోట సత్యం, గడ్డం వెంకటేష్ గౌడ్, కాశెట్టి సురేష్, మామిడి రాజన్న, మామిడి వెంకటేష్, కొడిమెల నరసయ్య, కోరుట్ల శ్రీనివాస్ తదితరు పాల్గొన్నారు.
