PRTU-S బుగ్గారం మండల అధ్యక్షుడిగా విజయ్ !


J.SURENDER KUMAR,


జగిత్యాల జిల్లా బుగ్గారం మండల పి ఆర్ టి యు టి ఎస్
బుగ్గారం మండల శాఖ అధ్యక్షులుగా చిట్నేని విజయ్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా అయిల్నేని సతీష్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


బుగ్గారం మండల శాఖ కార్యవర్గ సమావేశం, మరియు 2026-28 నూతన కార్యవర్గ ఎన్నిక మంగళవారం జరిగింది.
గత రెండు సంవత్సరాలుగా నిర్వహించిన కార్యక్రమాలు మరియు సభ్యత్వాల పై చర్చ, నివేదిక సమర్పణ మరియు ఆమోదం జరిగిన తర్వాత 2026-28 నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది


మండల అసోసియేట్ అధ్యక్షుడిగా వేముల చంద్రశేఖర్, మండల మహిళా అసోసియేట్ అధ్యక్షులు గా శ్రీమతి అతియా కౌసర్ , మండల ఉపాధ్యక్షులుగా బి జి గంగాధర్ కార్యదర్శి గా పాలెపు వంశీకృష్ణ, మహిళా కార్యదర్శిగా ఆడెపు మౌనిక లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి డి. విజయ్, దేవేందర్ లు ప్రకటించారు.


నూతన మండల కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు  బోయినపల్లి ఆనందరావు , యళ్ళ అమర్నాథ్ రెడ్డి  అభినందించారు. సంఘ బలోపేతం, ఉపాధ్యాయ సమస్యల సాధన పట్ల కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో PRTU TS రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గోవర్ధన ప్రసాద్ రాష్ట్ర కార్యదర్శి భూక్య అశోక్ రాథోడ్ ఇతర నాయకుల పాల్గొన్నారు.